సినిమాల బడ్జెట్ అంటే ఓసారి టైటానిక్ గుర్తొస్తుంది – అప్పట్లో దానికి ఖర్చయిన రూ. 17,180 కోట్లు ($200 మిలియన్) ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తరువాత Avengers: Endgame రూ. 30,000 కోట్ల బడ్జెట్‌తో వచ్చింది… ఇప్పుడు?

మార్వెల్ స్టూడియోస్ రూపొందిస్తున్న ‘Avengers: Doomsday’ బడ్జెట్ – ఓ షాకింగ్ అంకెలా ఉంది: రూ. 85,000 కోట్లు! (అంటే దాదాపు $1 బిలియన్!)
ఇది ప్రపంచ చరిత్రలో ఏ సినిమాకైనా ఖర్చయిన అత్యధిక మొత్తం!

స్టార్ల స్టార్మ్ – బడ్జెట్ దుమ్ము దులిపేస్తోంది!

ఈ భారీ ఖర్చులో ఒక్క నటీనటుల రెమ్యునరేషన్స్ కే రూ. 21,400 కోట్లు ($250 మిలియన్) కేటాయించారంటే… ఇంకేం చెప్పాలి?

Chris Hemsworth (Thor)

Tom Hiddleston (Loki)

Pedro Pascal (Mr. Fantastic)

Robert Downey Jr. — ఈసారి హీరో కాదు… విలన్ Doctor Doom గా రీ ఎంట్రీ!

అంతే కాదు… పాత హీరోలు, కొత్త హీరోలు — ఒకే ఫ్రేములో కనిపించనున్నారు.

Avengers + X-Men + Wakanda + Fantastic Four — అన్నీ ఒక్కటే లీగ్ లో! ఒక మెగా యూనివర్స్ వార్!

Avengers, X-Men, Wakandans, Fantastic Four, New Avengers… అందరూ కలసి ఒక్క శక్తివంతమైన విలన్ డాక్టర్ డూమ్‌ను ఎదుర్కొనే కథ. దానికీ దర్శకత్వం వహించేది Russo Brothers — Infinity War & Endgame ఫేమ్. కాబట్టి ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇది కేవలం సినిమా కాదు… ఇది ఒక సైన్స్ ఫిక్షన్ పాండవ గాధ!

లాభం వస్తుందా? భారీ రిస్కే కానీ…

ఈ మూవీ బడ్జెట్‌ను తిరిగి సంపాదించాలంటే… Endgame (రూ. 2.4 లక్షల కోట్లు) కన్నా ఎక్కువ కలెక్షన్ చేయాలి. విశ్వవ్యాప్త ప్రచార ఖర్చులు కూడా కోట్లలో ఉంటాయి. కావున Avengers: Doomsday బ్లాక్‌బస్టర్ కావడం చాలా అవసరం. లేదంటే… ఇది మార్వెల్‌కి భారీ ఫైనాన్షియల్ షాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

రిలీజ్ డేట్:
డిసెంబర్ 18, 2026 – ప్రపంచం మొత్తం థియేటర్ల వైపు చూసే రోజది!

ఇది సినిమా కాదు… సినిమా చరిత్రను తిరగరాయబోయే శక్తివంతమైన ప్రయోగం. Avengers: Doomsday – ఒక గ్రాఫిక్స్ అఫేర్ మాత్రమే కాదు, ఇది హాలీవుడ్ గెలుపోటముల మీద ట్రైలర్ లా మారబోతోంది!

ఎదురుచూడండి – ప్రపంచంలోనే ఖరీదైన సినిమా మీ థియేటర్‌కి రాబోయే రోజు కోసం !

, , , , , , ,
You may also like
Latest Posts from