
బాలీవుడ్ సూపర్‌స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ చిన్ని తెరపై పెద్ద చర్చకు తెరలేపారు. “టూ మచ్ విత్ కాజోల్ & ట్వింకిల్” (Amazon Prime Video, సెప్టెంబర్ 25) తొలి ఎపిసోడ్‌లో వీరిద్దరూ ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌లో వయసు తేడా పై బహిరంగంగా స్పందించారు.
కాజోల్ షాకింగ్‌గా: పెద్ద వయసు హీరోలు – చిన్న వయసు హీరోయిన్లు జంటగా కనిపిస్తే దాన్ని “సినిమా మాజిక్” అంటారు. కానీ పెద్ద వయసు హీరోయిన్ – చిన్న వయసు హీరో ఉంటే వెంటనే “బోల్డ్” అని బ్రాండ్ వేస్తారు!
ఆమీర్ వాదన: వయసు తేడా కొన్ని సార్లు కథా అవసరమే!
ట్వింకిల్ ఫైర్: హీరోయిన్లు 30–40 ఏళ్లు వచ్చిన వెంటనే వారిని “అమ్మ పాత్రల్లో” పెట్టేస్తారు. కానీ హీరోలు మాత్రం ఎప్పటికీ యంగ్ హీరోలుగానే ఉంటారు.
సల్మాన్ వివాదాస్పద కామెంట్: దర్శకులు పెద్దవాళ్లను చిన్నవాళ్లతో జోడిస్తారు, అదే రిపీటేషన్‌కి దూరంగా ఉండటానికి. కానీ ఇది రివర్స్‌గా చాలా అరుదుగా జరుగుతుంది. ఇంకా… “నా సినిమాల్లో ఇప్పటికే ఈక్వాలిటీ ఉంది… క్లీవేజ్, లెగ్స్ పైనే ఫోకస్ ఉంటుందని” ట్వింకిల్ సెటైర్ వేయగా, సల్మాన్ సరదాగా స్పందించాడు.
అదే సమయంలో సల్మాన్ మరో ఆసక్తికరమైన మాట చెప్పాడు – “ఇంటిమేట్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కి అసహజంగా అనిపిస్తాయి. కానీ నా ఫిట్‌నెస్‌ను చూసి యంగ్ జనరేషన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మొదలు పెట్టింది.”
ఈ డిస్కషన్ మళ్లీ ఒక పాత కానీ వేడి వాదనను తెరపైకి తెచ్చింది – హీరో–హీరోయిన్ల వయసు గ్యాప్. రాబోయే పెద్ద సినిమాలు ఈ ట్రెండ్‌కి ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారా? లేక కొత్త కథలే కోరుకుంటారా? చూడాలి.
