ఈ శుక్రవారం తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి సారంగపాణి జాతకం. మరొకటి అలిపుజ జింఖానా. వీటిలో సారంగపాణి జాతకంకు మంచి రెస్పాన్సే వచ్చింది. జింఖానా కూడా మరీ బ్యాడ్ అనిపించుకోకపోవడం బయ్యర్లకు ఊరట కలిగించింది. రివ్యూలు బాగానే ఉన్నాయి. అయితే కలెక్షన్స్ మాత్రం కనపడటం లేదు.
బుక్ మై షో ట్రెండ్స్ చూస్తే రెండు చిత్రాలూ గత ఇరవై నాలుగు గంటల్లో పది వేల లోపే టికెట్లు అమ్మాయి. సారంగపాణి జాతకం మరీ హిలేరియస్ గా నవ్వించలేదు కానీ ఉన్నంతలో కాలక్షేపం చేయించిందనే మాట వినిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎగబడతారు అనుకున్నారు.
కానీ మొదటి రోజునే బాక్సాఫీస్ వద్ద చాలా నీరసంగా ప్రారంభమైంది. తాజా అప్‌డేట్ ప్రకారం, సారంగపాణి జాతకం మొదటి రోజు రూ. 1 కోట్ల నికర వసూళ్లు సాధించింది. సారంగపాణి జాతాకం సోషల్ మీడియాలో కూడా మంచి సమీక్షలను చూసింది కాబట్టి ఇవి నిరుత్సాహపరిచే అంకెలే. చాలా మందికి షాక్ ఇచ్చాయి.
ఈ సినిమాకు ప్రధానంగా బిసి సెంటర్స్ లో పెద్దగా జనాలు కనిపించలేదు. టాక్ వచ్చాక చూద్దాంలే అనే ధోరణితో ప్రేక్షకులు ఎదురు చూడటంతో ఎక్కువ శాతం థియేటర్లు బొటాబొటి పబ్లిక్ తోనే షోలు రన్ చేశాయి. జింఖానాకు యూత్ బాగానే వెళ్తున్నారు కానీ అది కూడా మేజిక్ చేసేంత స్థాయిలో అయితే కాదు.