కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ థియేటర్లలోనే కాదు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ సంచలనాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి ఓ లాయర్ గా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సినిమా కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది. ఎంతో మంది ఈ సినిమాని మెచ్చుకున్నారు.

తాజాగా ఈ సినిమాపై ప్రముఖ నటుడు శరత్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. “నిన్న రాత్రే కోర్ట్ అనే తెలుగు సినిమా చూడడం జరిగింది. ఇదొక ఎక్సలెంట్ సినిమా. ప్రతీ ఒక్కరు చూడాల్సిన, ఆ అంతకుమించి తెలుసుకోవాల్సిన సినిమా ఇది. ఒక చదువు రాని వ్యక్తి కూడా చట్టం కోసం తెలుసుకోవాలి అని అనే పాయింట్ అద్భుతంగా ఉంది. ఇంకా ఈ సినిమాలో ఎన్నో ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

మనం నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని ఈ చిత్రం నేర్పింది. ఎప్పటికీ వెనకడుగు అనేది వెయ్యకూడదు, నిజమే ఎప్పటికైనా నెగ్గుతుంది అనే అంశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ కి అలాగే దర్శకుడు రామ్ జగదీశ్ కి నా అభినందనలు తెలుపుతున్నాను అని శరత్ కుమార్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇపుడు వైరల్ గా మారింది.

, , ,
You may also like
Latest Posts from