విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక్కొక్క అప్డేట్‌తో సినిమా మీద ఆసక్తి పెంచుతూ పబ్లిసిటీ నడుస్తోంది.
తాజాగా “అన్న అంటేనే” అనే పాట ప్రోమో విడుదల కాగా, అందులో సత్యదేవ్ పాత్రను ఫస్ట్ టైమ్ రివీల్ చేశారు. ఈ ఎమోషనల్ ట్రాక్‌లో విజయ్ – సత్యదేవ్ ఇద్దరూ కనిపించారు. సత్యదేవ్, విజయ్‌కు అన్నయ్య పాత్రలో కనిపించనున్నారని ఈ పాట ద్వారా కన్ఫర్మైంది.
అన్న – తమ్ముళ్ల బంధాన్ని హైలైట్ చేస్తూ, హృదయాన్ని తాకే సంగీతంతో అనిరుధ్ రవిచంద్రన్ ఈ పాటను కంపోజ్ చేశారు. పాటతో పాటు సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు పవర్‌ఫుల్ కథతో “కింగ్డమ్” మరో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి!