సాధారణంగా పెద్ద పండుగల సమయంలోనే తెలుగు తెరపై సినిమాల పోటీ ఊపందుకుంటుంది. కానీ ఈసారి సెప్టెంబర్ 5న ఎలాంటి పండుగ లేకపోయినా, సినిమాల బరిలో మాత్రం మినీ సంక్రాంతిలా మారిపోయింది! పాన్ ఇండియా ప్రాజెక్టులు నుంచి చిన్న చిత్రాల వరకు… ఒక్కరోజే చాలామంది టార్గెట్ చేశారు.
మిరాయ్ తో మొదలైన హంగామా!
తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న విజువల్ వండర్ “మిరాయ్”, సెప్టెంబర్ 5న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించబడ్డ మొదటి సినిమా. ఈ సినిమా చుట్టూ ఉన్న బజ్ చూస్తే, బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అనిపిస్తుంది. అయితే… ఇదే డేట్‌కు ఇతర సినిమాలు కూడా దిగుతున్నాయి!
ఏ సినిమాలు ఆ రోజుకు రెడీగా ఉన్నారంటే…
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి – జూలై 11న విడుదలవ్వాల్సి ఉండగా, ఇప్పుడు సెప్టెంబర్ 5వ తేదీని లాక్ చేయబోతున్నట్టు వార్తలు.
రష్మిక మందన్నా లీడ్ రోల్‌లో ఉన్న ది గర్ల్‌ఫ్రెండ్ – రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాకు కూడా అదే డేట్ టార్గెట్.
శివకార్తికేయన్ – మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న తమిళ చిత్రం మధ్రాసి – డబ్బింగ్ వర్షన్ కూడా అదే రోజున.
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న విభిన్నమైన కథతో కూడిన కాంతా.
విజయ్ ఆంటోనీ నటించిన థ్రిల్లర్ భద్రకాళి కూడా అదే డేట్ కోసం రంగంలోకి.
మిరాయ్ – ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్!
ఇన్ని సినిమాల మధ్య పోటీ ఉన్నా… ప్రేక్షకుల మనసుల్లో మొదటి ఆలోచన మిరాయ్ గురించే ఉంటుంది. టీజర్, మేకింగ్ వీడియోలతో ఈ సినిమా భారీ అంచనాల్ని సొంతం చేసుకుంది. కానీ, బాక్సాఫీస్‌లో మంచి వసూళ్ల కోసం కనీసం ఒక్క వారం మాత్రం సోలోగా రావాలి. లేకపోతే… మిరాయ్‌తో పాటు ఇతర సినిమాలపై కూడా క్లాష్ ప్రభావం పడటం ఖాయం.
మినీ సంక్రాంతి ఎఫెక్ట్…
ఒక్క సెప్టెంబర్ 5వ తేదీకే 5-6 సినిమాలు పోటీకి దిగితే, థియేటర్ల సేకరణ, స్క్రీన్ షేరింగ్, ఆడియెన్స్ అడిషన్ అన్నీ కలిపి పెద్ద యుద్ధమే. ఈ సంక్రాంతి పోటీలకు తగ్గట్టు కాకపోయినా… మినీ సంక్రాంతి స్ధాయిలో తెలుగు సినిమాప్రపంచం సందడి చేయనుంది!