‘ఓజీ’ రిలీజ్‌కు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా, సినిమా కంటెంట్, ట్రైలర్, బుకింగ్స్‌తో పాటు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అధికారిక ప్రకటన లేకపోయినా, వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం పవర్‌స్టార్ ఏకంగా ₹80 కోట్లు పారితోషికం తీసుకున్నారని చెబుతున్నారు. మిగతా వాళ్లకు ఎంత ఇచ్చారు?

బాలీవుడ్ నుంచి తెచ్చుకున్న విలన్ ఇమ్రాన్ హష్మి రూ.5 కోట్లు, డైరెక్టర్ సుజీత్ రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రూ.5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక మోహన్ రూ.1.5 కోట్లు, శ్రియా రెడ్డి రూ.50 లక్షలు అందుకున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ’ ఈ గురువారం (సెప్టెంబర్ 25) వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు ఎదురుగానే ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా మెరిసనున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి మొదలైన హైప్ – గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ వరకు ఎక్స్‌ట్రీమ్ లెవల్‌కు చేరుకుంది. తాజాగా సెన్సార్ పూర్తయి, సినిమా A సర్టిఫికేట్ పొందింది.

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రే ప్రీమియర్స్ మొదలుకానుండగా, ఆన్‌లైన్ బుకింగ్స్ హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ వేవ్ కోసం రెడీగా కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.

, , , , ,
You may also like
Latest Posts from