డీజే టిల్లు మూవీ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా అంటే ఆ క్రేజే వేరు. అతని కి అతి తక్కువ టైమ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ కు చేరింది. సిద్దు లేటెస్ట్ ఫిల్మ్ జాక్. ఈ సినిమా టీజర్ రిలీజైంది. ప్యాన్స్ లోనే కాకుండా బయిటకూడా హాట్ టాపిక్ గా మారింది.

ఈ టీజర్ లో సిద్ధుకి జంటగా బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ప్రేమ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకి పెట్టింది పేరైన ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత కొల్ల అవినాష్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మస్తున్నాడు. ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

https://www.youtube.com/watch?v=-Q_YWyX1mIY

టీజర్ లో సిద్దు క్యారెక్ట‌ర్‌ని చాలా టిపిక‌ల్ గా తీర్చిదిద్దారు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌. ప్యాబ్లో నిరూడా అనే ఓ కొత్త సైంటిఫిక్ ప‌దాన్ని ఈ టీజ‌ర్లో ప‌రిచ‌యం చేశారు.

‘మీ నాన్న‌కే తెలియ‌నంత గ‌లీజ్ జాబ్ ఏం చేస్తుంటావ్ నువ్వు’ అనే హీరోయిన్ ప్ర‌శ్న‌తో.. హీరో క్యారెక్ట‌ర్ ని రివీల్ చేశారు.

జాక్ ఎలాంటి జాబ్ చెయ్యకుండా బైకులు, పర్సులు దొంగతనం చేస్తుంటాడు. దీంతో తన తండ్రి (నరేశ్)కి తలా నొప్పిగా మారుతాడు.. ఈ క్రమంలో అనుకోకుండా హీరోయిన్ వైష్ణవి చైతన్యని కలుస్తాడు.. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక షబీర్ కల్లరక్కల్ విలన్ గా నటించాడు.

సిద్దు కామెడీ టైమింగ్‌, న‌రేష్ ఫ‌స్ట్రేష‌న్, వైష్ణ‌వి క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో ఈ టీజ‌ర్ స‌ర‌దాగా న‌డిచిపోయింది. చివ‌ర్లో యాక్ష‌న్ ట‌చ్ ఇచ్చారు.

డీజే టిల్లులో కర్లీ హెయిర్ తో లోకల్ బాయ్ లుక్ లో కనిపించిన సిద్దు… జాక్ లో డీసెంట్ లుక్ లో కనిపించాడు. ఇక వైష్ణవి చైతన్య కూడా యాక్టింగ్ పర్వాలేదనిపించింది. ఇక సీనియర్ నరేష్, బ్రహ్మజీ కామెడీ ఆకట్టుకున్నాయి.

,
You may also like
Latest Posts from