ప్రభాస్ హీరో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ రిలీజ్ డేట్ మీద మరోసారి సందేహాలు చుట్టుముడుతున్నాయి. మొదట ఏప్రిల్ 2024… తర్వాత సమ్మర్ 2025… అక్కడి నుంచి డిసెంబర్ 5, 2025… చివరకు జనవరి 9, 2026కి షిఫ్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ పై మళ్లీ టెన్షన్ మొదలైంది.
సంక్రాంతి రేసులో హైప్ బిల్డ్ చేసేందుకు టీమ్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసింది. పాట కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ ఉండగా, ఆ అప్‌డేట్ అకస్మాత్తుగా హోల్డ్ పడటంతో, “మళ్లీ వాయిదా పడుతుందా?” అన్న అనుమానాలు ఫ్యాన్స్‌లో తీవ్రంగా మొదలయ్యాయి.
ఇక సినిమాకు చాలా రోజులుగా కొత్తగా ప్రమోషన్లు లేకపోవడం కూడా డౌట్స్ మరింత పెంచింది.
కానీ… ఇండస్ట్రీలోని సర్కిల్స్ చెబుతున్నట్లు అయితే, వాయిదా టాక్ అంతా రూమర్ మాత్రమే. టీమ్ జనవరి 9, 2026 రిలీజ్ డేట్ మీదే ఫుల్ క్లారిటీతో పని చేస్తోందట. షూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు టర్బో మోడ్‌లో కొనసాగుతున్నాయట.
ఈ సినిమాకి భారీ స్థాయిలో VFX పని జరుగుతోంది. ఒక్కో పార్ట్‌ని వేర్వేరు స్టూడియోలు హ్యాండిల్ చేస్తున్నాయి. అన్ని VFX ఔట్‌పుట్‌లు డిసెంబర్ ఎండ్‌కు ఫిక్స్‌డ్ డెడ్‌లైన్తో ఇవ్వాలని చెప్పారట. కాబట్టి ఈసారి డేట్ మార్చే ఛాన్స్ లేదని అంటున్నారు.
మారుతి దర్శకత్వంలో, ప్రభాస్‌తో ఈ హారర్–కామెడీ పాన్ ఇండియా ఎనర్జీతో రాబోతోంది. మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్. మ్యూజిక్ — థమన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

