శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా అనూహ్య విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మే 9న విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చిన తొలి వారం ముగిసేలోపే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ వద్ద బంగారు బాట పట్టింది.
వాస్తవానికి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా, విడుదలకు ముందు టీం పెట్టిన ప్రమోషన్లు చక్కగా పని చేశాయి. రిలీజ్ కి ముందు రోజుల్లో మంచి హైప్ క్రియేట్ చేశారు. దాంతో, తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని, మంచి మౌత్ టాక్ (WOM) తో ముందుకు దూసుకెళ్లింది. ఏరియా వైడ్ కలెక్షన్స్ చూద్దాం.
Single
Including GST
Telangana – 02.80cr
Raayalaseema – 00.66cr
Kostandra + Uttarandra – 02.45cr
Telugu States 3Days
Total Theatrical Gross – 10.40cr
Telugu States 3Days
Total Theatrical Share – 05.91cr
Karnataka
Rest Of India
Overseas – 02.10cr
WorldWide 3Days
Total Theatrical Gross – 15.00cr
WorldWide 3Days
Total Theatrical Share – 08.01cr
WorldWide
Theatrical Share Break Even – 07.00cr
B L O C K B U S T E R
ఇలా అంచనాలను అధిగమిస్తూ ‘సింగిల్’ తన మొదటి వీకెండ్‌కే బ్రేక్‌ఈవెన్ సాధించి బాక్సాఫీస్ పరంగా శ్రీ విష్ణుకు మంచి ఊపునిచ్చింది. ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించినది ఎంటర్‌టైన్‌మెంట్ కోణం.
ప్రతి షోకి ఆడియెన్స్ రెస్పాన్స్ పెరిగింది, దాంతో కలెక్షన్లు కూడా మెరుగయ్యాయి. శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది.
వీకెండ్ మొత్తంగా చూసుకుంటే, ఈ సినిమా ₹15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, బిజినెస్ పరంగా బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను అందుకుంది. ఈ వారం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం వలన, ‘సింగిల్’ సినిమా మరో రెండు వారాల పాటు మంచి పరుగే కొనసాగించగలదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.