జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించి, ఇప్పుడు నిర్మాతగా ముందుకు వెళ్తున్న SKN తెలుగులో తనదైన శైలి కామెంట్స్, ప్రమోషన్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అదే ప్రమోషనల్ స్టైల్‌ ఇప్పుడు ఆయనకు వివాదాలను తెచ్చిపెడుతోంది.

ప్రభాస్ హీరోగా వస్తున్న “రాజా సాబ్” టీజర్ లాంచ్ ఈవెంట్ లో SKN తన స్పీచ్‌తో ఒక్కసారిగా హడావుడి సృష్టించారు. ఆయన మాటల్లో భావోద్వేగం ఎక్కువైనా, కొన్ని వ్యాఖ్యలు మాత్రం తీవ్ర విమర్శలకు గురయ్యాయి.

దర్శకుడు మారుతి గురించి మాట్లాడుతూ…మగాడి సత్తా ఏంటో భార్యకే తెలుస్తుంది.. అలానే ఓ ఫ్రెండ్ సత్తా ఏంటో.. 20 ఏళ్లుగా మారుతితో ఉన్న నాకే తెలుస్తుంది.. అన్నారు.

అయితే, “మగాడి సత్తా భార్యకే తెలుస్తుంది” అనే కామెంట్ పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది అసభ్యంగా ఉందని, ఫ్యామిలీ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్య అనవసరమని సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Jathini టీ షర్ట్‌తో మరో దుమారం

ఈ ఈవెంట్‌కు SKN వేసుకున్న టీషర్ట్‌పై “#Jathini” అనే పదం ఉండటం మరో వివాదానికి దారితీసింది. ఈ పదం ఫ్యాన్ వార్స్‌లో అసభ్య పదానికి సంక్షిప్త రూపంగా ఉపయోగపడుతోంది. ఇది బహిరంగంగా ప్రోత్సహించటం సరైంది కాదని అభిమానులు, పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నారు.

పాజిటివ్ – నెగటివ్ అన్న భేదం లేకుండా.. ప్రచారం కావాలన్నదే SKN లక్ష్యం?

ఇలాంటి వ్యాఖ్యలు, డ్రామా, రెచ్చగొట్టే భాష… ఇవన్నీ పబ్లిసిటీ కోసం కావచ్చని చాలామంది చెబుతున్నారు. ఫ్యాన్స్ రెస్పాన్స్ కోసం ఏ హద్దు దాటినా సరే అనే దృక్పథమే కొన్ని టాలీవుడ్ ప్రమోటర్లలో కనిపిస్తోందన్నదే ఇప్పుడు విశ్లేషకుల మాట.

,
You may also like
Latest Posts from