తాజాగా శ్రీలీల తీసుకున్న ఓ కెరీర్ డిసిషన్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అది మరేదో కాదు అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న “లెనిన్” సినిమాలో ఇప్పటికే సగం షూట్ పూర్తి చేసి, టీజర్‌లో కూడా కనిపించిన శ్రీలీల, ఒక్కసారిగా ఆ సినిమా వదిలేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

దీనికి కారణం ఆమె బాలీవుడ్ డ్రీమ్స్. బాలీవుడ్ ప్రయాణం

శ్రీలీల తన హిందీ ఎంట్రీని “ఆషికీ 3” తో ప్లాన్ చేస్తోంది. అనురాగ్ బాసు డైరెక్షన్‌లో, కార్తిక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే, బాలీవుడ్ సర్కిల్స్‌లో శ్రీలీల గురించి హడావుడి మొదలైంది.

ఇప్పటికే మరో రెండు హిందీ సినిమాలకు సైన్ చేసింది. అందుకే అఖిల్ సినిమా వదిలేసి, పూర్తి దృష్టి హిందీ వైపే పెట్టిందని చెప్పొచ్చు.

ఇక “పుష్ప 2” లో చేసిన ఐటెం సాంగ్ “కిస్సిక్” నార్త్ బెల్ట్‌లో శ్రీలీలకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. దీంతో, బాలీవుడ్ మేకర్స్ కూడా ఆమెను తమ ప్రాజెక్ట్‌లలో ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు.


జాగ్రత్తగా అడుగులు

అయితే, ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నది ఒక్కటే – బాలీవుడ్‌లో అడుగు పెట్టడం అంత ఈజీ కాదు.

తాజాగా NTR చేసిన “వార్ 2” కూడా బోల్తా కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు, గతంలో రామ్ చరణ్, ప్రభాస్ కూడా హిందీ మార్కెట్‌లో ఎదురుదెబ్బ తిన్నారు.

అందుకే ఫ్యాన్స్ అంటున్నారు:

“శ్రీలీల పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమవ్వకూడదు. ఇక్కడే ఆమెకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ మధ్య బ్యాలెన్స్ చేస్తేనే స్టార్‌డమ్ నిలుస్తుంది.”

శ్రీలీల ప్రస్తుత సినిమాల జాబితా

తెలుగు:

  1. Mass Jathara – రవి తేజాతో, రిలీజ్ కి దాదాపు రెడీ.
  2. Ustaad Bhagat Singh – పవన్ కళ్యాణ్ సరసన, హాఫ్ షూట్ కంప్లీట్, 2026 రిలీజ్.

హిందీ:

  1. Aashiqui 3 – కార్తిక్ ఆర్యన్‌తో.
  2. Diler – ఇబ్రాహీం అలీ ఖాన్‌తో.

తమిళ్:

  1. Parasakthi – శివకార్తికేయన్ సరసన, 2026 జనవరి రిలీజ్.
, , , , , , , , , , ,
You may also like
Latest Posts from