శ్రీలీల క్రేజ్, జోరు మామూలుగా లేదు! టాలీవుడ్‌లోనే కాదు, డైరెక్ట్‌గా కోలీవుడ్ – బాలీవుడ్ రెండింట్లోనూ గేమ్ ఆడేస్తోంది. అంతేకాదు మొదటి హిందీ సినిమా థియేటర్స్‌కి రాకముందే అక్కడ వరస ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి!

తమిళలోకీ వస్తే… రీసెంట్‌గా శివకార్తికేయన్ తో కలిసి “పరశక్తి” అనే తన డెబ్యూ సినిమా చేసింది. ఈ మూవీ సంక్రాంతి 2026 కి రెడీగా ఉంది. కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.

ఇప్పుడు హాట్ న్యూస్ ఏంటంటే… తల అజిత్ కుమార్ నెక్ట్స్ మూవీకి శ్రీలీలను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేశారట. ఇది చిన్న విషయం కాదు – అజిత్ – అధిక్ రవిచంద్రన్ కాంబోలో వస్తున్న AK64 కదా.

ఆమె హీరోయిన్‌గా వస్తుందా? లేక స్క్రీన్‌ని షేక్ చేసే ఇంపార్టెంట్ రోల్‌లోనా?… ఇంకా సస్పెన్స్. కానీ ఒకటైతే పక్కా – శ్రీలీల ఎంట్రీ అంటే, మాస్ – గ్లామర్ – క్రేజ్ అన్నీ ఫుల్ డోస్‌లో గ్యారెంటీ.

అయితే … ఇలా రెండు ఇండస్ట్రీల్లో ఒకేసారి టాప్ స్లాట్స్ పట్టేయడం అంటే, ‘ఇదంతా ఎవరి గేమ్ ప్లాన్?’ అని రూమర్స్ మొదలవ్వటం మాత్రం ఖాయం! ఇంతకీ ఎవరైనా ఉన్నారా.

, ,
You may also like
Latest Posts from