తెలుగులో హాట్ స్టార్ గా దూసుకుపోతోంది శ్రీలీల. సీనియర్ హీరోలు తమ సినిమాలో ఆమె స్పెషల్ డాన్స్ లు కోరుకుంటే, యంగ్ హీరోలు తమ ప్రక్కన ఆమె నటించాలని ఆశిస్తున్నారు. అయితే ఆమె దృష్టి మాత్రం బాలీవుడ్ పై ఉంది.

పుష్ప2లో ఐటెం సాంగ్‌ కిస్సిక్‌తో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దీంతో బాలీవుడ్‌లో వరుస ఛాన్స్‌లు కొట్టేస్తోంది. ఇప్పటికే యంగ్ హీరో ఇబ్రహీం అలీఖాన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు శ్రీలీల. అయితే తాజాగా మరో బంపరాఫర్ ఆమెను వరించిందంటూ బాలీవుడ్ టాక్.

బాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేయనున్నారట. దాని కోసం శ్రీలీలను సంప్రదించగా, దానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది .

కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం బాలీవుడ్​లో వరుస హిట్‌లతో దూసుకెళ్తున్నరని, అతని సరసన శ్రీలీల మంచి ఆలోచన అని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు.

శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’, పవన్ కల్యాణ్​తో ‘ఉస్తాద్ భగత్’ సింగ్ వంటి సినిమాలు చేస్తోంది. వీటితో పాటు తమిళంలో ‘పరాశక్తి’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్​లో తన లుక్​ అలాగే డైలాగ్​ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.

,
You may also like
Latest Posts from