అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో నాని నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి, రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’లో నానీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

రాజమౌళి తన గొప్ప ప్రాజెక్ట్‌లో నానీని భాగస్వామిగా తీసుకుంటున్నట్లు ప్రకటించి, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించారు. ‘ఈగ’లో నాని చేసిన పాత్ర తరువాత, రాజమౌళి సినిమా మళ్లీ నానీకి మరో అవకాసం ఇస్తున్నానని ప్రకటించటం మంచి స్ఫూర్తినిచ్చింది.

హైదరాబాద్‌లో జరిగిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్.ఎస్. రాజమౌళి గతంలో ‘మహాభారతం’ చిత్రాన్ని పది భాగాలుగా తెరకెక్కించాలనే తన కలను పలు సార్లు మీడియాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు, ఈ డ్రీమ్ ప్రాజెక్టులో నాని కూడా ఉన్నాడని అధికారికంగా ప్రకటించడం, అభిమానులను ఊరటనిచ్చే వార్త అయింది.

రాజమౌళి మాట్లాడుతూ, “మహాభారతంలో నాని పాత్ర ఇంకా ఖరారు కాలేదు కానీ, అతను ఈ ప్రాజెక్ట్‌లో ఉంటాడు” అని అన్నారు. దీంతో, ఈ భారీ చిత్రంలో నాని పాత్ర ఎమౌతుందా అనే స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి.

ప్రస్తుతం రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ‘SSMB29’ అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై పనిచేస్తున్నారు. ఈ సినిమా యొక్క చిత్రీకరణ ఒడిశా మరియు ఇతర ప్రాంతాలలో జరిగింది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత, రాజమౌళి ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించబోతున్నారు.

, , , ,
You may also like
Latest Posts from