తెర వెనుక సంగతులతో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ (RRR: Behind& Beyond) డాక్యుమెంటరీ ఇప్పుడు జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ జపాన్ వెళ్లారు. దాంతో జపాన్ వెళ్లి మరీ ఓ డాక్యుమెంటరీని ప్రమోట్ చేయాల్సిన అవసరం రాజమౌళి కు ఎందుకు వచ్చిందనేది హాట్ టాపిక్ గా మారింది.
రాజమౌళి గతంలో బాహుబలి 2 మరియు RRR చిత్రాలను జపాన్‌లో ఉద్వేగభరితంగా ప్రమోట్ చేశారు. కానీ ఆ దేశంలో ఒక డాక్యుమెంటరీని ప్రమోట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జపాన్‌లో డాక్యుమెంటరీలకు మాస్ అప్పీల్ ఉన్న దేశం కాదు. అయితే రాజమౌళి పనిగట్టుకుని అక్కడకు వెళ్లి ప్రమోట్ చేయటం వెనక స్ట్రాటజీ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
こちらも何回見ても興奮するぜ💨💨💨#RRR#IMAX pic.twitter.com/prAolADQBJ
— 🇺🇦Hiromi🇯🇵 (@romiqueen) April 12, 2025
అందుకు కారణం కొందరు చెప్పేదేమిటంటే నెట్‌ఫ్లిక్స్ తో ఈ డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం మొదటే ఎగ్రిమెంట్ చేసుకున్నారని. అదే చేస్తున్నారని అంటున్నారు.అలాంటిదేమీ లేదు రాజమౌళి తన నెక్ట్స్ సినిమాకు ఇప్పటి నుంచే మార్కెట్ ని బలోపేతం చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. అందులో భాగమే జపాన్ లో వెళ్లటం అంటున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమకు ప్రపంచస్థాయిలో గుర్తింపుతెచ్చారు రాజమౌళి. ఈ చిత్రం జపాన్‌లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డులు సృష్టించింది. ఇప్పుడు దీని డాక్యుమెంటరీని కూడా జపాన్ ప్రేక్షకులు అలానే ఆదరిస్తారని రాజమౌళి అన్నారు.
ఈ ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ విషయానికొస్తే.. సుమారు 3 ఏళ్ల ఈ సినిమా ప్రయాణానికి సంబంధించి 20టీబీ ఫుటేజ్ రాగా దాన్ని ఎడిట్ చేసి.. బెస్ట్ మూమెంట్స్‌ను తీసుకుని 1:38 గంటల నిడివితో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
何回見ても興奮するぜ💨#RRR pic.twitter.com/5iNoZMIIfg
— 🇺🇦Hiromi🇯🇵 (@romiqueen) April 12, 2025
యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ విజువల్స్, చిత్రబృందం అభిప్రాయం తదితర సంగతులు ఇందులో చూపించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్(Netflix)లో అందుబాటులో ఉంది.