సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి మొదటిసారి కలసి చేస్తున్న SSMB29 కోసం క్రేజ్ ఇప్పటికే ఆకాశాన్ని తాకింది. అభిమానుల అంచనాలు, సోషల్ మీడియాలో హవా, ట్రైలర్ కాన్సెప్ట్ లు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ సినిమా మీద ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా వేరే లెవెల్! ఈ నేపధ్యంలో ఈ సినిమా విడుదల ఎప్పుడు అయ్యే అవకాసం ఉందనే విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటి తాజా సమాచారం ప్రకారం, SSMB29 టీమ్ ఆఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను లాక్ చేసిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు మార్చ్ 25, 2027 ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు . అంటే వేసవీ సీజన్ ప్రారంభం, గుడ్ ఫ్రైడే వారం చివరి విడత సెలవులు, ఫెస్టివల్ హాలిడేస్ కూడా ఉంటుండటం వలన, ఈ సినిమా కోసం ఐడియల్ డేట్ ఫిక్స్ చేస్తున్నారట.
ఇప్పటివరకు సినిమా టైటిల్, కంటెంట్, కధా వివరణ—ఏది అయినా అధికారికంగా బయటకు రాలేదు. కానీ మాస్టర్ రాజమౌళి ఇటీవల చెప్పారు, అన్ని అధికారిక వివరాలు నవంబర్‌లో షేర్ చేస్తారని.
మహేష్ ఫ్యాన్స్ హవా నుంచి, ఇండియాలోని సాధారణ ప్రేక్షకుల curiosity వరకు—ఎందుకంటే, బాహుబలి, RRR వంటి blockbusters తీసిన రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ కోసం ఏ కొత్త విజయం తేవబోతున్నాడో చూడాలి అనే ఆసక్తి మించిపోయింది.