రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్-ఇండియా సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని పూర్తిచేసిన వెంటనే, ఆయన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టనున్నాడు. ఇప్పటికే సుకుమార్‌తో మరో సినిమా చేసేందుకు చర్చలు ఫైనల్ దశకు చేరగా, త్రివిక్రమ్ – వెంకటేష్ మల్టీ స్టారర్‌లో చరణ్ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఇప్పటికే ఇదంతా చాలనట్టు… ఇప్పుడు ఓ కొత్త పేరు కూడా చరణ్ లైన్‌లో ఉన్నాడని వినపడుతోంది. అతనే సుజీత్! పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ వంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్న సుజీత్, ప్రస్తుతం ఆ సినిమా చివరి దశ షూటింగ్‌ను కంప్లీట్ చేస్తున్నాడు.

‘ఓజీ’ పూర్తయిన వెంటనే నానితో ఓ సినిమా చేయాలన్నది సుజీత్ ప్లాన్. కానీ నాని ప్రస్తుతం ‘పారడైజ్’ అనే ఇంటెన్స్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండటంతో, ఆ సినిమా కొంతకాలం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ గ్యాప్‌ను వాడుకోవాలని ఫిక్సయిన సుజీత్, రామ్ చరణ్ కోసం ఒక మాస్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. చరణ్‌కి ఆ కథ బాగా నచ్చిందని, ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టే అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు. ఈ ప్రాజెక్ట్‌కి DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫుల్ సపోర్ట్ ఇవ్వనుందని కూడా సమాచారం.

చరణ్‌కి మాస్ అవతారం కొత్తేమీ కాదు. ‘దృవ’, ‘రంగస్థలం’, ‘వినయ విధేయ రామ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ – ప్రతి చిత్రంలో ఆయన యాక్షన్ ప్రెజెన్స్ మెప్పించిన తీరు అందరికీ తెలుసు. ఈసారి సుజీత్ మాస్ యాక్షన్ కథను మరింత స్టైలిష్‌గా, గ్రాండ్‌గా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాడట.

పైగా ‘సాహో’ తర్వాత సుజీత్‌కి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అవసరమే. చరణ్‌తో సెట్ అయ్యే ఈ ప్రాజెక్ట్ అతనికి ఓ కమర్షియల్ బ్రేక్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి ఎప్పుడు వస్తుందో స్పష్టంగా చెప్పలేం. మినిమమ్ 2026 ఫస్టాఫ్ వరకూ టైం పడే ఛాన్సుంది. కానీ అప్పటివరకు స్క్రిప్ట్ ఫైన్ ట్యూనింగ్, ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం వాడుకుంటారు.

మొత్తానికి… చరణ్ – సుజీత్ కాంబో సెట్టవైతే, అది మాస్ మసాలా అభిమానులకే కాకుండా బాక్సాఫీస్‌కూ పండగే అని చెప్పొచ్చు!

, , ,
You may also like
Latest Posts from