‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రతో సునీల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ సినిమాలో మ్యాసీ ఇమేజ్‌ను సంపాదించుకున్న అతను, అప్పటి నుంచి రెగ్యులర్ కామెడీ ట్రాక్‌కి దూరంగా ఉండి, పాత్రలో వెరైటీ కోసం కృషి చేస్తున్నారు. అయితే ఈ వారం విడుదల కాబోయే ఒక సినిమాలో సునీల్ సరికొత్తగా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ నవ్వించబోతున్నట్లు సమాచారం.
నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకటి. మరి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో నటుడు సునీల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన రోల్ ఈ సినిమాలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది అని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. అలాగే సునీల్ నుంచి మంచి డార్క్ కామెడీ ఈ చిత్రంలో ఉంటుందని ప్రామిస్ చేస్తున్నారు.
ఇంతకీ సునీల్ పాత్ర ఏమిటి
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సునీల్ పాత్ర …గోవాలో కనిపించే ఓ డాన్ అని తెలుస్తోంది. లడ్డు పాత్ర తండ్రి మురళి గౌడ్ ని కిడ్నాప్ చేస్తాడని, అక్కడ నుంచి వచ్చే ఫన్ ఎపిసోడ్ సెకండాఫ్ లో హైలెట్ అంటున్నారు.
అంటే మ్యాడ్ స్క్వేర్ లో మాత్రం సునీల్ హైలైట్ గా ఉంటారని తన మాటలతో అర్ధం చేసుకోవచ్చు. ఇక భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం రేపు మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.