ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొన్ని వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అవుతాయి. వాటి రెండో భాగం కోసం జనం ఎదురుచూస్తూంటారు. మళ్లీ థ్రిల్ మూమెంట్ ని అనుభవించాలని తహతహలాడిపోతూంటారు. అలాటి వెబ్ సీరిస్ లకు భాషతో సంబంధం ఉండదు. అలా 2022లో వచ్చిన తమిళ వెబ్‌సిరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ (Suzhal: The Vortex). కాథిర్, ఐశ్వర్యా రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను ‘పుష్కర్-గాయత్రి’ క్రియేట్ చేయగా, బ్రహ్మ జి – అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, 30 భాషల్లో విడుదలైన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, వివిధ ఓటీటీ అవార్డులు సైతం సొంతం చేసుకుంది.ఇప్పుడు ఈ సీరిస్ కు నెక్ట్స్ పార్ట్ వస్తోంది.
తెలుగులో డబ్ అయి గ్రాండ్ సక్సెస్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ దర్శకుడు రాజమౌళి, హృతిక్‌రోషన్, ధనుష్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసల్ని అందుకుంది.
సూపర్ హిట్ అయ్యిన ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ‘సుడల్: ది వొర్టెక్స్’ సీజన్-2 (Suzhal The Vortex Season 2) అలరించడానికి సిద్ధమైంది. సీజన్-1లో ఉన్న పాత్రలతో పాటు, ఈసారి మంజిమా మోహన్, కాయల్ చంద్రన్ తదితరులు అతిథి పాత్రల్లో కనపడనున్నారు.
పుష్కర్-గ్రాయత్రి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కు ప్రధాన ప్లస్ పాయింట్. అలాగే, మధ్యలో వచ్చే ట్విస్ట్‌లూ అలరిస్తాయి.
మెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి సీజన్-2 స్ట్రీమింగ్ కానుంది.
తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
మొదటి సీజన్ లో కథేంటంటే: షణ్ముగం (పార్తిబన్) ఎంతోకాలం నుంచి పనిచేస్తున్న ఓ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో అనుకోనివిధంగా అగ్ని ప్రమాదం జరుగుతుంది. అయితే సరిగ్గా అదేరోజున షణ్ముగం చిన్న కూతురు నీలా (గోపిక) కూడా కనిపించకుండా పోతుంది. ఈ రెండు కేసుల్ని విచారణ చేయడానికి రెజీనా (శ్రియ రెడ్డి), అలాగే చక్రి (కాథిర్)లను పోలీస్‌శాఖ నియమిస్తుంది.
ఈక్రమంలో వారికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి వారు తెలుసుకున్న నిజాలు ఏంటి? నీలా మిస్సవడానికి కారణం ఏంటి? సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదానికి కారకులు ఎవరు? ఈ కేసులని వారు ఛేదించారా లేదా అనేది సిరీస్.