తమిళ స్టార్‌ విజయ్‌ (Vijay)హీరో గా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘విజయ్‌ 69’, ‘దళపతి 69’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం టైటిల్ ను తాజాగా చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీనికి ‘జన నాయగన్‌’ అనే పేరు ఖరారు చేసింది. ఈ మేరకు విజయ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది.

ఈ ఫస్ట్ లుక్ లో ఆయన స్టైలిష్‌ లుక్‌లో.. తన అభిమానులతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సినీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన కథతో భారీస్థాయిలో ఈ సినిమా సిద్ధమవుతోందని చెప్తున్నారు.

పూజాహెగ్డే హీరోయిన్. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, బాబీ దేవోల్‌, ప్రియమణి, మమితా బైజు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. గతేడాది ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ మొదలైంది.

విజయ్‌ గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీని ఆయన స్థాపించారు.

ఈ క్రమంలోనే సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దళపతి 69 తర్వాత ఆయన సినిమాలు చేయరని బయిట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాపై విజయ్‌ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

, ,
You may also like
Latest Posts from