విక్రమ్ హీరో గా ‘తంగలాన్’ సినిమాను దర్శకుడు పా రంజిత్ రూపొందించాడు. స్టూడియో గ్రీన్ – నీలమ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. క్రితం ఏడాది ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు. తమిళ్ ప్రభ తయారు చేసిన కథ ఇది. వెట్టి చాకిరి నుంచి బయటపడటం కోసం ఒక తెగకి చెందిన ప్రజలు, మాంత్రిక శక్తులను .. విషసర్పాలను ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడ్డారనేది కథ. అడవులు .. కొండలు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఎంపికైంది.
‘తంగలాన్’ చిత్రం నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న రాటర్‌డామ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో(International Film Festival Rotterdam) డైరెక్టర్ కట్ ప్రదర్శితం కాబోతున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
18 శతాబ్దంలో నడిచే కథ .. బంగారు గనుల నేపథ్యంలో ఒక తెగకి చెందిన గూడెం ప్రజలు చేసే పోరాటం కథ. ఇది కలర్ఫుల్ గా .. కనువిందుగా సాగే రెగ్యులర్ సినిమా కాదు.
దర్శకుడు ఈ కథను మొదటి నుంచి చివరివరకూ సీరియస్ గా చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది ఒక ప్రత్యేకమైన కంటెంట్ తో కూడిన సినిమా. అందువలన ఎంటర్టైన్ మెంట్ కి దూరంగా నడుస్తుంది.
ఆడియన్స్ కోరుకునే వినోదం పాళ్లు అంతగా లభించవు. కొన్ని అంశాలను పక్కన పెడితే డాక్యుమెంటరీకి దగ్గరగా అనిపిస్తుంది. ఒకటి రెండు వివాదాస్పదమైన సన్నివేశాలు .. సంభాషణలు ఉన్నాయి.
‘తంగలాన్’ సినిమా కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.