

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ’. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా కోసం అఖండ-2ను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రచారం జరుగుతున్నా అసలు నిజం వేరే ఉందంటున్నారు. ఈ మార్పుకి అసలు కారణం ఎవరో తెలుసా?
మీడియాతో మాట్లాడిన బాలయ్య స్పష్టంగా చెప్పేశారు – సంగీత దర్శకుడు థమన్‌కి కావాల్సిన సమయం అందలేదని. అదే కారణంగా సినిమా వాయిదా పడిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా ఇచ్చారు – “మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ 50 రెట్లు ఘనంగా, భారీ స్థాయిలో ఉంటుంది. డిసెంబర్ మొదట్లోనే రిలీజ్ అవుతుంది” అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. కానీ బాలయ్య రిలీజ్ డేట్ మారటంతో కోపంగా ఉన్నారని వినపడుతోంది.
ఇంకా మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ OG విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలకూ థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాబట్టి, ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులు హ్యాండిల్ చేయడం ఆయనకూ సవాలు అయింది.
తాజా సమాచారం ప్రకారం, అఖండ 2 డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో థియేటర్లలో సందడి చేయనుంది.