రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో మూడో సినిమా చేయనున్నారు నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ కలిసి ఐ ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ఆ మధ్యన ప్రకటించారు. రమేష్‌వర్మతో కోనేరు సత్యనారాయణకు ఇది హ్యాట్రిక్ కొలాబరేషన్. ఈ సారి బిగ్ యాక్షన్ అడ్వంచరస్‌కి శ్రీకారం చుట్టారు.
రాఘవా లారెన్స్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ని విలన్ గా చూపించబోతున్నారు. ఈ మేరకు డిస్కషన్స్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా బాలీడు స్టార్ మరెవరో కాదు బాబీ డయోల్. ఇప్పటికే వరస పెట్టి తెలుగు సినిమాలు చేస్తున్న బాబీ.ఈ కొత్త సినిమాలో కొత్త గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాకు ‘కాలభైరవ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు. త్వరలో షూటింగ్‌ను ప్రారంభించి 2025 చివర్లో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది ఈ ప్రాజెక్ట్.
ఈ సినిమాలో పాన్ ఇండియా సూపర్ హీరోగా కనిపించనున్నాడు లారెన్స్. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మేకర్స్. మరోవైపు లారెన్స్ మాస్టర్ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తున్న ‘బుల్లెట్ బండి’ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమానుకూడా పాన్ ఇండియా సినిమాగా తెరేకేక్కిస్తున్నారు.