వైవా హర్ష – ప్రవీణ్ కాంబినేషన్‌లో అదిరిపోయే హిలేరియస్ రైడ్‌ గా రూపొందుతోంది ‘బకాసుర రెస్టారెంట్’ (Bhakasura Restaurant). ఈ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ఫస్ట్‌లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమా మీద బజ్ మరింత పెరిగింది.

హాస్యం తో పాటు పంచ్‌లు, హారర్ మూడ్‌ను సమపాళ్లలో మిక్స్ చేసిన ఈ ట్రైలర్, సినిమా హిలేరియస్ గా ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా ఇస్తోంది. కామెడీ టైమింగ్‌లో దిట్ట అయిన ప్రవీణ్, వైవా హర్ష హాస్యంతో స్క్రీన్‌ను నవ్వులతో నింపేయబోతున్నారనే చెప్పాలి.

హాస్యం + హారర్ = బకాసుర రెస్టారెంట్!

ఈ చిత్రంలో షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

, ,
You may also like
Latest Posts from