ఈ షాకింగ్ సంఘటన ముంబైలో జరిగిన హోలీ పార్టీలో చోటు చేసుకుంది. వేధింపుల ఆరోపణలపై ఒక టీవీ నటి తన సహనటుడిపై పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మార్చి 14న ముంబై నగర శివారులో హోలీ పార్టీ జరిగింది, అక్కడ తన సహనటి తనను అనుచితంగా, అసభ్యంగా తాకరాని చోట తాకినట్లు నటి వెల్లడించింది.
తన అనుమతి లేకుండా తనకు రంగులు అద్దారని ఆరోపిస్తూ నటి వెంటనే ముంబై పోలీసులకు నటుడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నటుడు, నటి ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. పోలీస్ లు చెప్పటానికి ఇష్టపడలేదని బాలీవుడ్ లో ప్రముఖ పత్రికలు రాసుకొచ్చాయి.
రిపోర్ట్ ల ప్రకారం, నటి అనేక టీవీ షోలలో మరియు చిన్న-సిరీస్‌లో కూడా పనిచేసింది. ఆమె పోలీసులకు వాంగ్మూలం నమోదు చేసింది. అందులో నటి తన సహనటుడు తనను అనుచితంగా తాకినప్పుడు, తాను చాలా షాక్ అయ్యానని చెప్పుకుంది.
ఆ ఎఫ్ ఐ ఆర్ లో ఇలా ఉంది. “అతను పార్టీలో నాతో పాటు ఇతర మహిళలపై రంగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నేను అతనితో హోలీ ఆడటానికి ఇష్టపడలేదు, అందుకే, నేను అతని నుండి దూరంగా వెళ్ళిపోయాను, నేను వెళ్లి టెర్రస్ వద్ద ఉన్న పానీపూరీ స్టాల్ వెనుక దాక్కున్నాను, కానీ అతను నా వెంటే వచ్చి నాకు రంగు వేయడానికి ప్రయత్నించాడు.అప్పుడే తాకరాని చోట తాకాడు” అని ఉంది.