సంక్రాంతి రిలీజ్ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj)లో ‘దబిడి దిబిడి’ సాంగ్ లో స్టెప్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే టీమ్ కానీ మరొకరు కానీ ఏమీ స్పందించలేదు. అయితే ఓటిటి రిలీజ్ కు దగ్గరవుతున్న టైమ్ లో ఆ పాటలో డాన్స్ చేసిన ఊర్వశీ రౌతాలా స్పందించారు. ప్రేక్షకుల నుంచి ఈవిధమైన స్పందన తాను అస్సలు ఊహించలేదని అన్నారు. ఆ పాట, అందులోని స్టెప్పులను ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఈవిధంగా మాట్లాడతారని తాను అస్సలు అనుకోలేదని తెలిపారు.

ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ… ‘‘ ‘దబిడి దిబిడి’ సాంగ్ రిహార్సల్స్‌ అంతా ప్రశాంతంగా జరిగింది. అన్ని పాటలకు ఏవిధంగా కొరియోగ్రఫీ ఉంటుందో అదేవిధంగా ఈ పాటకూ చేశాం. శేఖర్‌ మాస్టర్‌ ఈ పాటకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే నాలుగుసార్లు ఆయనతో కలిసి వర్క్‌ చేశాను.

ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు నాకు ఏమాత్రం విభిన్నంగా లేదా అభ్యంతరకరంగా అనిపించలేదు. సాధారణమైన స్టెప్పుల మాదిరిగానే భావించా. కానీ, పాట విడుదలయ్యాక సోషల్‌మీడియాలో వచ్చిన విమర్శలు చూసి షాకయ్యా.

కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పుపట్టడానికి కారణం ఏమిటో అంచనా వేయడానికి కూడా సమయం లేకపోయింది. అంతా సడెన్‌గా జరిగిపోయింది. రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని మేము అస్సలు ఊహించలేదు. రిహార్సల్స్‌ క్లిప్స్‌ విడుదల చేసినప్పుడు ఎలాంటి విమర్శలు రాలేదు’’ అని ఊర్వశీ రౌతేలా తెలిపారు.

ఏదేమైనా సోషల్‌మీడియా లో కొంతమంది కావాలని చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని చెప్పారు.

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలైంది. ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశీ రౌతేలా అతిథి పాత్ర పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది నిర్మితమైంది.

, , , ,
You may also like
Latest Posts from