బయోపిక్ సినిమాలు అనగానే మన తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్, తమిళంలో జయలలిత బయోపిక్, ఝాన్సీ లక్ష్మీ భాయ్ బయోపిక్ లు గుర్తు వస్తాయి. అయితే చారిత్రిక వ్యక్తులు బయోపిక్ లు తీయటం అరుదు. ఎందుకంటే చరిత్రను తెరకెక్కించటం భారీ బడ్జెట్ తో కూడుకున్న పని, అలాగే ఆనాటి వాతావరణం క్రియేట్ చేయటానికి అత్యంత శ్రమ అవసరం. అంతా చేసాక చరిత్ర వక్రీకరణ విమర్శలు తప్పవు. అయితే వీటిన్నటిని బేరీజు వేసుకుని బ్లాక్ బస్టర్ కు అవసరమైన కంటెంట్ తో ఈ చిత్రం బయిటకు వచ్చి హై సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి, హిందీలో అంత పెద్ద హిట్ అవటానికి కారణం ఏమిటి?

కథేంటి

ఛత్రపతి శివాజీ మరణించాడని వార్త విన్నంత సేపు మొఘల్ రాజు సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా)మొహంలో ఆనందం నిలవదు. అందుకు కారణం శివాజీ వారసుడు,,ఆయన తనయుడు శంభాజీ మహారాజా(విక్కీ కౌశల్). శంభాజీ పాలనలోకి వచ్చిన వెంటనే మొఘల పాలనకు చెక్ చెప్పటం మొదలెడతాడు. ఓ మొఘల్ ప్రాంతాన్ని గెలిచి షాక్ ఇస్తాడు. దాంతో ఔరంగజేబు శంభాజీకి ఓ ప్రతిపాదన పంపుతాడు. తమ మతమైన ఇస్లామ్ స్వీకరించి, తన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తే యథేచ్ఛగా మరాఠా రాజ్యాన్ని శంభాజీ ఏలుకోవచ్చు అని చెప్తాడు. అయితే శంభాజీ అందుకు చలించడు. అందుకు శంభాజీ ప్రతిగా ఔరంగజేబ్ కూతురును తనకిచ్చి పెళ్ళి చేస్తే అప్పుడు ప్రతిపాదనను అంగీకరిస్తానని సమాధానమిస్తాడు.

ఈ క్రమంలో అటు ఔరంగబేజుకు, ఇటు శంభాజీకి మధ్యా యుద్దం మొదలవుతుంది. మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబు సేనలు అన్ని వైపులా ముట్టడిస్తుండగా శంభాజీ కూడా తన సైన్యంతో మొఘల్ సైన్యాన్ని మట్టుపెడుతూ ఉంటాడు. అయితే శంభాజీని దెబ్బతీయలేమని కొద్ది కాలానికే ఔరంగజేబు కు అర్దమవుతుంది. దాంతో సంఘమేశ్వర్ లో శంభాజీ అతితక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకున్న మొఘలులు ఓ పన్నాగం పన్నుతారు. దొడ్డిదారిన శంభాజీని బంధించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమైంది, శంభాజీని ఔరంగజేబ్ దెబ్బ తీయగలిగాడా, మొఘల్ సామ్రాజ్య పతనానికి శంభాజీ ఎలా కారణమయ్యాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..

సాధారణంగా బయోపిక్ తరహా చిత్రాలు అన్నిఎక్కువ శాతం తమ ప్రధాన పాత్రల జీవితాల్లోని చీకటి కోణాలను ప్రక్కన పెట్టి గొప్ప విశేషాలను హైలెట్ చేస్తూంటాయి. ఛావా కూడా అదే దారిలో మొహమాటం లేకుండా ప్రయాణం పెట్టుకుంది. ఈ సినిమాలో హైపర్ నేషనలిస్టక్ వే లో హీరో పాత్రను చూపాలని దర్శకుడు భావించాడు. అదే చేసి సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ కథలో ఓ బంగారు మనస్సు ఉన్న హీరో, అత్యంత దుర్మార్గుడైన విలన్ పాత్రలను స్పష్టంగా మలచటం మరీ కలిసొచ్చింది. కాప్రమైజ్ అయ్యింటే కథ కూలిపోయి ఉండేది.

దాంతో టిపికల్ విలన్, హీరో కథే అయినా చారిత్రక వ్యక్తి కథ కావటం, రాచరికం నేపధ్యం, ధర్మం,మతం వంటి విషయాలను హైలెట్ చేస్తూ ఆ యాంగిల్ లో కథ నడపటంతో సినిమాకు నెక్ట్స్ లెవిల్ దక్కింది. ముఖ్యంగా సినిమాటెక్ లాంగ్వేజ్ ని ఫెరఫెక్ట్ గా వాడుకున్న సినిమా ఇది. సినిమాలో మూడవ వంతు శంభాజీ జీవితంలో ముఖ్యమైన విషయాలు చూపటానికే సరిపోయింది. ఆ పాత్రపై ప్రజలకు ఉన్న భక్తి, నమ్మకం, సెంటిమెంట్ ని వాడుకునే విధంగా కథ,కథనం నడిపారు. అదే ఈ రోజున సినిమా ఈ స్దాయి సక్సెస్ అవ్వటానికి కారణమైంది. ఇంతకీ ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం.

టెక్నికల్ గా …

ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వటానికి కారణం టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండటమే. తెలుగులో డైలాగ్స్ బాగానే రాసుకున్నా, డబ్బింగ్ లో ఆ రేంజ్ ఎమోషన్ తో చెప్పి మెప్పించలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము దులిపారు. పాటలు బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫెరఫెక్ట్ వర్క్ . దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ కథని మొఘల్స్ తో పోరాటం నుంచి చనిపోయేవరకు అద్భుతంగా రాసుకొని ఎమోషన్ పండించారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు చాలానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. న మరాఠా సేనలు ‘జై భవానీ’, ‘హర హర మహదేవ్’అంటూ విరుచుకు పడే సీన్స్ ని అంతే కన్సీన్సింగ్ గా, నైపుణ్యంతో తీసారు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ .

నటీనటుల్లో శంభాజీగా విక్కీ కౌశల్‌ విశ్వరూపం చూపించారు. క్లైమాక్స్ 20 నిమిషాల్లో విక్కి నటన కన్నీరు పెట్టించాడు. ఔరంగజేబుగా అక్షయ్‌ ఖన్నా, శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి పాత్రలను బాగా పండించారు. అశుతోష్ రాణా (Ashutosh Rana), ప్రదీప్ రావత్ (Pradeep Rawat) లాంటి సీనియర్ నటులు అదరకొట్టారు. అయితే డబ్బింగ్ సోసో గా ఉంది.

చూడచ్చా

మతం, చరిత్ర వంటి విషయాలను ప్రక్కన పెడితే నచ్చే సినిమా. అయితే అదే సమయంలో స్వజాతి అనే ఓ భావోద్వేగాన్ని నింపుకోవాల్సిన అవసరమూ ఉంది. లేకుంటే ఏదో డ్రామా చూసిన ఫీలింగ్ వస్తుంది.

నటీనటులు: విక్కీ కౌశల్‌, రష్మిక, అక్షయ్‌ ఖన్నా, అషుతోష్‌ రాణా, వినీత్‌ కుమార్‌ సింగ్‌, డయానా పెంటి తదితరులు;
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌;
సినిమాటోగ్రఫి : సౌరభ్ గోస్వామి (Saurabh Goswami)
నిర్మాత: దినేశ్ విజన్ (Dinesh Vijan)
దర్శకత్వం: లక్ష్మణ్‌ ఉటేకర్‌;
తెలుగు రిలీజ్ : గీతా డిస్ట్రిబ్యూషన్
విడుదల: 07-03-2025

, ,
You may also like
Latest Posts from