విజయ్ దేవరకొండకు అర్జెంట్ గా హిట్ కావాలి. అందుకోసం ఓ పెద్ద నిర్మాత, మంచి టైటిల్, మంచి దర్శకుడు సెట్ అయ్యాయి. కెరీర్ కు లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లా కష్టపడ్డాడు. ఓ కొత్తలుక్ ని చూపించాడు. అయితే తెరపై కొత్త సినిమా చూపించాడా, కొత్త కథను ఆవిష్కరించాడా, అదేంటి, ముఖ్యంగా విజయ్ దేవరకొండను విజయ తీరాల వైపు నడిపించే సినిమానేనా?
స్టోరీ లైన్
సూరి (విజయ్ దేవరకొండ) పోలీస్ కానిస్టేబుల్ గా చేస్తూంటాడు. అతనికి తన అన్న శివ (సత్యదేవ్)అంటే ప్రాణం. అతను చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్లిపోయి ఉంటాడు. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకావాలి, కలవాలి అని సూరి తాపత్రయం. అతన్ని తిరిగి ఇంటికి తేవాలనేదే జీవితాశయం. అలాంటి పరిస్దితుల్లో అతనికి తన అన్నను కలిసేందుకు ఓ అవకాసం వస్తుంది.
తన అన్న శ్రీలంకలోని జాప్నాలో ఉన్నాడని, అక్కడికి స్పై గా వెళ్లి కలవమని ఓ ఆఫర్ వస్తుంది. అన్న కోసం ఆ ఆఫర్ ని అందుకుని శ్రీలంక వెళ్తాడు. అక్కడ జాఫ్నా జైలులో ఉన్న తన అన్నను ఖైధీలా వెళ్లి కలుస్తాడు. అప్పుడు ఏమౌతుంది. తన అన్నను సూరి వెనక్కి తేగలిగాడా. అసలు శివ అక్కడ జైలుకు ఎందుకు వెళ్ళాడు. ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి, కింగ్డమ్ అనే పదానికి జస్టిఫికేషన్ ఎలా ఇచ్చారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
కేజీఎఫ్ సినిమా ఎంత మందికి ఓ కథగా ఇన్సిప్రేషన్ ఇచ్చిందో కానీ చాలా మందిని మేకింగ్ దిసగా చెడగొడుతోంది. ఆ సినిమాలాంటి భారీ సినిమా తీయాలి హిట్ కొట్టాలనుకోవటం తప్పులేదు కానీ అదే ఛాయిలు, కొలతలు పట్టుకుని చేస్తే అటు కేజీఎఫ్ కాదు..ఇటు లేజీ ఎఫ్ కాదు..ఇదే కింగ్డమ్ కు జరిగింది. భారీ సినిమా తీయాలి, కేజీఎఫ్ లాగ ఉండాలి అన్నట్లు గా పెద్ద ప్రపంచం క్రియేట్ చేసి అందులోకి హీరోని ప్రవేశ పెడుతున్నారు. అయితే ఆ పద్మవ్యూహం లోంచి హీరోని బయిటకు తీసుకుని రావటం మాత్రం చేతకావటం లేదు.
ఫస్టాఫ్ లు బాగానే ఉంటున్నాయి. సెకండాఫ్ లు చెల్లా చెదురైపోతున్నాయి. ఇవి చాలదన్నట్లు సెకండ్ పార్ట్ సిండ్రోమ్ ఇండస్ట్రీని వేధిస్తోంది. ప్రతీ పెద్ద సినిమా సెకండ్ పార్ట్ కోసం తమ దగ్గర ఉన్న కథను రెండు ముక్కలు చేసే ప్రాసెస్ లో మూడు ముక్కలైపోతోంది. ఫస్ట్ పార్ట్ కు సరైన ముగింపు ఇవ్వలని పరిస్దితి. ముందు మొదటి పార్టే సరిగ్గా లేనప్పుడు రెండో పార్ట్ కు జనం వస్తారనుకోవటం భ్రమ. ప్రతీ కథా రెండు పార్ట్ ల కు లొంగదు. బడ్జెట్ పెరిగింది కదా అని ముక్కలు చేద్దామంటే అది ముక్కలై చూసే వారి మనస్సుని, సమయాన్ని ముక్కలు చేసేస్తుంది. ఈ సినిమాది కూడా అదే పరిస్దితి.
నటీనటుల్లో ..
విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో కనిపిస్తాడు. నటన కూడా డిఫరెంట్ గా ట్రై చేసారు. ఇక భాగ్యశ్రీ బోర్సే సినిమాలో చెప్పుకోదగిన పాత్రమీ లేదు. సత్యదేవ్ బాగా చేసాడు కానీ గుర్తించుకోవాల్సినంత నటన కాదు. .. యంగ్ విలన్ వెంకిటేశ్ నటన బాగా చేసాడు అంతే.
టెక్నికల్ గా గిరీశ్ గంగాధరం .. జోమన్ టి జాన్ ఫొటోగ్రఫీ, అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకి అన్ని బాగానే సెట్ అయ్యాయి. నవీన్ నూలి ఎడిటింగ్ మాత్రం ఫస్టాఫ్ కు సెట్ అయ్యినట్లుగా సెకండాఫ్ లో లేదు.
చూడచ్చా
టెక్నికల్ గా బాగున్న ఈ సినిమాని ఓ లుక్కేయవచ్చు. అయితే ఎక్సపెక్టేషన్స్ లేకుండానే, ముఖ్యంగా విజయ్ దేవరకొండ కోసం చూడచ్చు.