విశ్వక్ సేన్ నటించిన లేటేస్ట్ మూవీ లైలా. లైలా చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ అయినా విషయం తెలిసిందే.. డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ సంపాదించుకుని చతికిల పడింది. దాంతో రిలీజ్ కంటే ముందే టీజర్, ట్రైలర్ తో మంచి క్యూరియాసిటీని కలిగించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇందులో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కనిపించారు. అయితే ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా రూ.2 కోట్ల గ్రాస్ మాత్మరే కలెక్షన్స్ దక్కించుకుంది.
దాదాపుగా రూ.20 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చించి తీసిన ఈ సినిమా మినిమం వసూళ్లు కూడా కలెక్ట్ చెయ్యలేదు. దీంతో విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
అయితే ఇటీవలే లైలా సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని లైలా పెద్దగా మెప్పించలేకపోయినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా లైలా ఓటీటీలో రిలీజ్ అయ్యి రెండు రోజులు కావస్తున్నప్పటికీ కనీసం వ్యూస్ కూడా రానట్లు తెలుస్తోంది.
స్టోరీ నేరేషన్ వీక్ గా ఉండటం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం దీనికితోడు లైలా రిలీజ్ కు ముందు ఈ సినిమాలో నటించిన పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడంతో మొదటినుంచే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ మొదలైంది…