మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ డ్రామా ‘OG’…
ఈ రెండూ టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హైప్ ఉన్న ప్రాజెక్టులు. ఒక్క టీజర్, ఒక్క పోస్టర్ వచ్చినా సోషల్ మీడియాని క్రేజ్ తో ఊగిపోయేలా చేస్తున్నాయి.
కానీ… ఇప్పుడు ఈ రెండూ రిలీజ్ గేమ్‌లో ఊగిసలాడుతున్నాయి. తేడా లేకుండా ఒకదాని రిలీజ్ కు మరోటి దారి ఇవ్వబోతుందంటూ ఇండస్ట్రీలో వినపడుతోంది.
విశ్వంభర – సంక్రాంతి నుంచి దసరాకి మారింది! మొదట సంక్రాంతి 2025కి రిలీజ్ ప్లాన్ చేసిన విశ్వంభర, టీజర్‌కు వచ్చిన మిశ్రమ స్పందన, విజువల్స్ మీద వచ్చిన నెగటివ్ టాక్ వల్ల వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం అని చెబుతూ రిలీజ్‌ను వాయిదా వేసేశారు.
ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విడుదల తేదీ ప్రకటించలేదు గానీ, తాజా సమాచారం ప్రకారం “సెప్టెంబర్ 25 – దసరా స్పెషల్” గా రిలీజ్ ప్లాన్ చేస్తుందట UV క్రియేషన్స్ టీమ్.
ఇక OG ఇప్పటికే సెప్టెంబర్ 25ననే రిలీజ్ అఫీషియల్‌గా ప్రకటించేసింది పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో వస్తున్న “They Call Him OG”,
ముందే సెప్టెంబర్ 25 అని ప్రకటించి ప్రోమోషన్ మొదలుపెట్టేసింది. అదే రోజున విశ్వంభర కూడా వస్తే?
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం – OG బాగా ముందంజలో ఉండినా, పవన్ – చిరంజీవిల మధ్య గౌరవ సంబంధం వల్ల OG చిత్రం ఒకవేళ డిసెంబర్ మూడో వారం లేదా క్రిస్మస్‌కి వెళ్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఆలస్యం = లాసులు: UVకి సమయమే విలువ
విశ్వంభర దసరాకి రాకపోతే, సంక్రాంతి 2026లో చిరు – అనిల్ రావిపూడి సినిమా ఉందన్న కారణంగా వెంటనే వేసవి 2026 దాకా వెళ్తే, నిర్మాతలకు భారీగా నష్టం తలెత్తే అవకాశముంది. అందుకే UV క్రియేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సెప్టెంబర్ 25నే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఫైనల్ గేమ్ ప్లాన్ ఎలా?
OG ముందే ప్లాన్ చేసినా, మెగా ఫ్యామిలీ హార్మనీ కోసం దారి విడిచే అవకాశం ఉంది. విశ్వంభర VFX పనులు వేగంగా పూర్తైతే – దసరా బరిలోకి దిగనుంది. ఇప్పటిదాకా OG అధికారిక పోస్ట్పోన్మెంట్ టాక్ మాత్రం రాలేదు – కానీ అంతర్గతంగా ప్లానింగ్ మొదలైందట.
విశ్వంభర దసరాకు వస్తే – OG డిసెంబర్‌కు వెళ్లొచ్చు.
OG తన స్థానంలో నిలబడితే – విశ్వంభర ఇంకో ఏడాది వేచి చూడాల్సి వస్తుంది.