పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ హంగామా ఏ రేంజిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. థియేటర్ల దగ్గర ఆల్రెడీ ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. ఈ క్రేజ్ ముందు మిగతా నిర్మాతలు కనపడే పరిస్దితి కనపడటం లేదు. దాంతో వారంతా వెనక్కి తగ్గాల్సి వస్తోంది. అలాంటి ఉదాహరణే తాజాగా మిరాయ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తీసుకున్న నిర్ణయం.

ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తోంది. వరల్డ్ వైడ్ 125 కోట్లకు చేరువలో ఉంది. కానీ, పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కోసం తన సక్సెస్ రన్‌ను పాజ్ చేయడానికి సిద్ధమయ్యారు ప్రొడ్యూసర్. ప్రధాన థియేటర్లతో సహా ఓజీ ప్రీమియర్స్, ఓపెనింగ్ షోలు కోసం మిరాయ్ థియేటర్లను కేటాయించాలని డిస్ట్రిబ్యూటర్లకు స్పష్టంగా ఆదేశించారు.

ఇదే కాకుండా, ఓజీ ప్రీమియర్స్ ఇవాళ, రేపు జరగబోతున్నాయి. అంతా ఓజీ షోలు మాత్రమే నడుస్తాయి. ఇక మిరాయ్ మళ్లీ శుక్రవారం నుండి కొనసాగుతుంది.

అసలు విషయమేమిటంటే, విశ్వప్రసాద్ కు పవన్ కళ్యాణ్ తో ఉన్న బంధం. హరి హర వీర మల్లూ రిలీజ్ సమయంలో కూడా ఆయన పవన్ కి అండగా నిలిచారు. ఇప్పుడు కూడా పవన్ సినిమాకి స్పేస్ ఇవ్వడానికి తన హిట్ సినిమా స్క్రీన్లను పక్కన పెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీంకి కృతజ్ఞతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పై వారి నిస్వార్థమైన మద్దతును ఫ్యాన్స్ “లెజెండరీ మూవ్” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from