స్పీడు అంటే ఇదే అనిపించేలా షూటింగ్ ను స్పీడుగా ముగించడంలో పూరి జగన్నాథ్ స్టైల్. భారీ సెట్స్ వేసే బదులు, సింపుల్ లొకేషన్లలోనే పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఆయన క్రిటికల్ యాక్టింగ్‌తో పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి షెడ్యూల్స్ పక్కాగా ప్లాన్ చేసి షూట్‌ను త్వరగా ముగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ బయిటకు వచ్చింది. అదే రిలీజ్ డేట్.
తాజా సమాచారం ప్రకారం… ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా క్రిస్మస్ సీజన్‌కు రిలీజ్ కావచ్చని టాక్. పెద్ద సినిమాలు ఏవీ ఆ టైమ్‌కి రిలీజ్ అవకపోతే, ఖచ్చితంగా ఈ సినిమా క్రిస్మస్‌కు థియేటర్లలోకి రానుంది.
విజయ్ సేతుపతి పాత్ర – ఆయన పర్ఫామెన్స్ ఈ సినిమాకి స్పెషల్ హైలైట్ అంటున్నారు చిత్రబృందం. ఇక టబు, సమ్యూక్తా, దునియా విజయ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాత్కాలికంగా టెక్నీషియన్ల వివరాలు బయటకు రాలేదు కానీ, ఈ ప్రాజెక్ట్‌ను పూరి కనెక్ట్స్ నిర్మిస్తోంది.
విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఫస్ట్ టైమ్ కావడంతో, ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అవుతోంది! దర్శకుడిగా విజయాన్ని అందుకునేందుకు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు పూరి జగన్నాథ్. ఆయన గత చిత్రాలు ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో హిట్ అందుకోవడమే లక్ష్యంగా విజయ్ సేతుపతితో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.