కామెడీ ఎంటర్‌టైనర్స్‌లో వరుసగా విజయాలు అందుకుంటున్న హీరో శ్రీ విష్ణు, ఇప్పుడు మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ‘సామజవరగమన’, ‘సింగిల్’ సినిమాల సక్సెస్‌లతో జోరుమీదున్న ఆయన, ఈ దసరా సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ చేశారు.

ఆ రెండు ప్రాజెక్టులలో ఒకటి ‘సామజవరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఉండగా, మరొకటి హాట్ టాక్‌లో నిలుస్తున్న ‘కామ్రేడ్ కల్యాణ్‌’. ఈ సినిమాను జానకిరామ్ మూరెళ్ల డైరెక్ట్ చేస్తున్నారు.

టైటిల్ ‘కామ్రేడ్’ అని ఉందని ఇది ఎలాంటి నక్సలిజం డ్రామా అనుకుంటే పొరపాటే!
ఇది శ్రీ విష్ణు మార్క్ పక్కా కామెడీ ఎంటర్‌టైనర్!

పీపుల్ స్టార్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు!

ఈ సినిమాలో శ్రీ విష్ణు, విప్లవ నటుడు ఆర్. నారాయణ మూర్తి అభిమానిగా కనిపించబోతున్నారని ఇన్‌సైడ్ టాక్. చిన్నప్పటినుంచి నారాయణ మూర్తి సినిమాలు చూసి పెద్దయ్యే ఓ కుర్రాడు… ఒకరోజు ఎలా నక్సలైట్‌గా మారాడు? — అనేదే ఈ సినిమాలోని ట్విస్టీ థీమ్!

కానీ కథ సీరియస్‌గా వినిపించినా, ప్రెజెంటేషన్ మాత్రం పూర్ కామెడీ టోన్‌లో ఉంటుందని సమాచారం. అంటే, ‘కామ్రేడ్ కల్యాణ్‌’లో సీరియస్ సబ్జెక్ట్‌ని కూడా ఫుల్ హిలేరియస్‌గా చూపించబోతున్నారు.

1992 లోని AOB నేపథ్యం – నక్సలిజం మధ్య నవ్వులు!

ఈ సినిమా కథ 1992 ప్రాంతంలోని ఆంధ్ర–ఒరిస్సా బోర్డర్ (AOB) నేపథ్యంలో సాగుతుంది.
ప్రస్తుతం షూటింగ్ దాదాపు సగం పూర్తయ్యింది.
మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
విలన్‌గా టామ్ చాకో ఇంపాక్ట్ ఫుల్ రోల్ చేస్తున్నారు.
‘బేబీ’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఫేమస్ అయిన విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.

ఇంకో సినిమా రెడీగా ఉంది!

ఇదే సమయంలో శ్రీ విష్ణు నటించిన మరో ప్రాజెక్ట్ ‘మృత్యంజయ‌’ షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్‌లో థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

సంక్షిప్తంగా చెప్పాలంటే…

‘కామ్రేడ్ కల్యాణ్‌’ – నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పూర్ కామెడీ రైడ్!
ఆర్. నారాయణ మూర్తి ఫ్యాన్‌గా శ్రీ విష్ణు కొత్తగా కనిపించబోతున్నారు!
సీరియస్ సబ్జెక్ట్‌కి కామెడీ ఫ్లేవర్ జోడించి ఒక “హిలేరియస్ రివల్యూషన్” చూపించబోతున్న టీమ్!

, , , ,
You may also like
Latest Posts from