పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం “OG – They Call Him OG” పై ఇప్పటికే భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సాంగ్ Firestorm వరకూ వచ్చిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్‌లో పూనకం రేపింది. అయితే ఇప్పుడు ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది — పవన్ కళ్యాణ్ డీ-ఏజింగ్ టెక్నాలజీతో యవ్వనంగా కనిపించబోతున్నాడట!
సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ కోసం పవన్ కళ్యాణ్‌ను యువవయస్సులో చూపించాల్సి రావడంతో, దర్శకుడు సుజీత్ స్పెషల్ డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడినట్టు టాక్. ఫ్యాన్స్ చెబుతున్నట్టు అయితే, ఆ లుక్ పక్కా massive shocker కాబోతోంది! పవన్ లుక్ చూస్తే జవాన్ పవన్ గుర్తొస్తాడట అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
ఇంతకీ… ఇది కేవలం యథార్థమేనా? లేక డీ-ఏజింగ్ టాక్ సినిమాకు ఇంకాస్త క్రేజ్ తేవడానికి వేసిన ప్లాన్ అన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి.
ఈ గాసిప్ కు బలం చేకూర్చేలా మరో న్యూస్ — ఈ నెలలోనే కొత్త యాక్షన్ టీజర్ + సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. బజ్ పరంగా “OG” ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతున్నా, ఈ డీ-ఏజ్డ్ పవన్ టాక్‌తో ఇంకెంత హైప్ పెరగబోతుందో చూడాలి!