జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’ (Param Sundari). సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళ యువతి, దిల్లీ యువకుడి ప్రేమకథే ఈ ‘పరమ్ సుందరి’. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. సుందరి దామోదరం పిళ్లైగా జాన్వీ, పరమ్ సచ్‌దేవ్‌గా సిద్ధార్థ్ నటించారు. తుషార్ జలోటా దర్శకత్వం వహించారు.
ఇక ఈ చిత్రం రివ్యూలు వచ్చేశాయి – కానీ రిజల్ట్ కాస్త కన్‌ఫ్యూజింగ్!
NDTV రివ్యూ ప్రకారం – ఇది కొన్ని షారుఖ్ ఖాన్ సినిమాల మిశ్రమం లాంటిదట.
Bollywood Hungama మాత్రం – “ఓకే జస్ట్ వాచ్ మాత్రమే” అంటూ కొంచెం నిరుత్సాహపరిచింది.
చాలా రివ్యూలలో కామన్ పాయింట్: స్టోరీ ప్రెడిక్టబుల్. కానీ, జాహ్నవి గ్లామర్, పెర్ఫార్మెన్స్ మాత్రం బలంగా పనిచేశాయి.
“ఆమెలో నటనలలో నిజాయితీ ఉంది – అదే ఆ పాత్రని నిలబెట్టింది” అని ఒక క్రిటిక్ ప్రత్యేకంగా హైలైట్ చేశాడు.
అయితే, ‘పరదేసియా’ అనే వైరల్ సాంగ్ ఉన్నా కూడా సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర హంగామా చేయలేకపోయింది. అలాగే పూర్తిగా రిజెక్ట్ కూడా కాలేదు. మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో ‘పరమ్ సుందరి’ వీకెండ్ చివరి అయ్యేసరికి ఏ రేంజ్‌లో ఆడుతుందో చూడాలి!
ఇంతకీ ఈ చిత్రం జాహ్నవి కపూర్‌కి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా? లేక మరో “జస్ట్ ఓకే” మూవీగా మిగిలిపోతుందా?