బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియా స్టేజ్‌పై కూడా అదే రికార్డులు… దీపికా పదుకునే మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏ సినిమాతో కాదు, కేవలం ఓ రీల్‌తోనే!
ఇండియన్ స్క్రీన్‌పై స్టార్‌డమ్‌కు బ్రాండ్ విలువని జతచేసిన పేర్లలో దీపికా పదుకునే ఒకటి. కానీ ఈసారి ఆమె మెరుపు వెండితెరపై కాదు — ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో. ఒక లగ్జరీ హోటల్ బ్రాండ్‌తో కలిసి చేసిన ఓ ప్రమోషనల్ వీడియో… ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తోంది.
ఈ రీల్‌ను కేవలం ఎనిమిదు వారాల్లో 1.9 బిలియన్ వ్యూస్ చూశారు. అవును, బిలియన్! ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షింపబడిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఒకటిగా నిలవబోతున్నది.
ఫ్యాన్స్ కామెంట్ల విరివిగా రెస్పాండ్ అవుతుండగా… డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్‌లో దీపికా పేరు ఇప్పుడు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ సింబల్గా మారింది.
ఇదే ఆమెకి ఎందుకు భారీ బ్రాండ్ డీల్స్ వస్తున్నాయో, ఎందుకు టాప్ పారితోషికం అందుకుంటోందో సాక్ష్యం. ఇటీవలే భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా ఆమె రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికపైనూ దూసుకుపోతోంది.
సినీ ఫ్రంట్‌లో దీపికా ప్రస్తుతం #Kalki2898AD తర్వాత, అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #AA22xA6 చిత్రంలో నటిస్తోంది. ఇది ఆమె రెండవ తెలుగు సినిమా. ఇందులో ఆమెకు పారితోషికంగా రూ. 25 కోట్లు, అదనంగా లాభాల్లో వాటా కూడా ఉన్నట్టు సమాచారం!
ఒకే ఒక్క రీల్‌తో ప్రపంచాన్ని మళ్లీ తనవైపు తిప్పేసిన దీపికా పదుకునే… ఇప్పుడు “స్టార్‌హుడ్ 2.0” అంటే ఇదేనేమో అని ప్రూవ్ చేస్తోంది!