రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda) సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుందనే సంగతి తెలిసిందే. చిన్నగా మొదలెట్టి ప్యాన్ ఇండియాని ఎట్రాక్ట్ చేసే స్దాయికి ఎదిగాడు. అలాంటి విజయ్, ‘మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరి (gowtham tinnanuri) తో చేతులు కలిపారు. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
వందకోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 28 అంటే వేసవి శెలవులు కలిసొచ్చేలా రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ కు రావటం లేదు. వేరే సినిమా ఆ ప్లేస్ లోకి వచ్చి చేరింది.
అదే సితార ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమాని ఈ చిత్రం ప్లేస్ లోకి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలకు నిర్మాత ఒకరే కాబట్టి ఇబ్బంది ఉండదు. బీటెక్ కాలేజీలో ముగ్గురు కుర్రాళ్లు చేసే అల్లరి, వాళ్ల కథలు ప్రధానంగా తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. బాక్సాఫీస్ బరిలో సంచలన విజయాన్ని సాధించింది.
ఆ చిత్రానికి సీక్వెల్‌గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా విడుదల తేదీ ముందుకు వచ్చిందని టాక్.
మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో మ్యాడ్ బాయ్స్ గ్యాంగ్ సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ మరోసారి సందడి చేయనున్నారు. సీక్వెల్‌ను కూడా ‘మ్యాడ్’ రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ‘లడ్డు గాని పెళ్లి’ చార్ట్ బస్టర్ అయ్యింది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘VD12’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర టీమ్.