మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరక్టర్స్ తో వరస సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలకు పోటీగా ఈ సీనియర్ హీరో దూసుకుపోతున్నారు. తను చేస్తున్న విశ్వంభర పూర్తి కాక ముందే శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి చిత్రాలను లైన్లో పెట్టాడు. ఇంకా కొంత మంది యంగ్ డైరక్టర్స్ చెప్పే కథల కోసం చిరంజీవి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి కూడా ఈ లైన్లో ఉన్నాడని తెలుస్తోంది. చిరంజీవి తనకు తగిన కథ ఉందా? అని వెంకీ అట్లూరిని అడిగినట్టుగా తెలుస్తోంది.
దుల్కర్ తో చేసిన లక్కీ భాస్కర్ హిట్ తరువాత వెంకీ అట్లూరి ఇమేజ్ నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి ప్రస్తుతం మళ్లీ ధనుష్‌తోనే సినిమాను చేస్తున్నాడని సమాచారం. అయితే లక్కీ భాస్కర్ హిట్ అయిన తరువాత దర్శక, నిర్మాతల్ని చిరు ప్రశసించాడు.
ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి స్థాయి కథ తన దగ్గర లేదని, ఇంకో ఏడాది తరువాత వస్తాను అని వెంకీ అట్లూరి చెప్పాడట. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత నాగవంశీ బయటపెట్టేశాడు.
చిరు స్థాయికి తగ్గ కథను రాసే లోపు ఇంకో సినిమాను వెంకీ అట్లూరి పూర్తి చేయబోతోన్నాడు. మరో ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం తన వద్ద నాలుగు స్క్రిప్ట్‌లు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో ఓ రొమ్ కామ్ కూడా ఉన్నట్టుగా సమాచారం.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు తగిన కథను ఎంపిక చేయటం కష్టమే. ఎందుకంటే దాదాపు అన్ని రకాల కథలూ ఆయన ఇప్పటికే చేసేసారు. ఏ కథ చెప్పినా కొత్తగా అనిపించదు.