వైవిధ్యమైన సినిమాలతో బాలీవుడ్ లో మంచి దర్శకుడిగా అనురాగ్‌ కశ్యప్‌ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవ్ డి’ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ పార్ట్ 1 & పార్ట్ 2, ‘రామన్ రాఘవ్ 2.0’, ‘లస్ట్ స్టోరీస్’ వంటి హిందీ చిత్రాలను తెరకెక్కించారు. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ను ప్రొడ్యూస్ చేసారు. ఇప్పుడు ఆయన నటుడుగా మారి ఫుల్ బిజీ అయ్యారు. చాలా చిత్రాలలో అతిథి పాత్రలు చేసిన అనురాగ్ అడపాదడపా కీలక పాత్రలను సైతం హిందీ చిత్రాలలో చేశాడు.

అంతేకాదు… ఆరేడేళ్ళ క్రితమే తమిళ చిత్రసీమలోకి ‘ఇమైక్కా నోడిగల్’తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘లియో’ (Leo) లో అతిథి పాత్రలో మెరిసిన అనురాగ్ కశ్యప్ ‘మహారాజ, విడుదలై -2’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. విశేషం ఏమంటే గత యేడాది మలయాళంలోనూ ‘రైఫిల్ క్లబ్’ అనే మూవీతో మల్లూవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అనురాగ్.

తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘డకాయిట్’ (Dacoit) మూవీలో ఓ పాత్రను అనురాగ్ కశ్యప్ పోషిస్తున్నాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందుతున్న భారీ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’. పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునే ప్రియుడిగా అడివి శేష్ కనిపించబోతున్నాడు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం వంటి ఎమోషన్స్ తో మూవీ నడుస్తుంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అంటూ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అనురాగ్ పాత్ర పేరు ఇన్స్పెక్టర్ స్వామి. ఆయన ఇందులో భాగం కావడం పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన పోస్టర్ ను షేర్ చేశారు.

ఆ పోస్ట్ లో “అయ్యప్ప భక్తుడైన పోలీసు అధికారురిగా నటించడం సరదాగా, ఛాలెంజింగ్ గా ఉంది. ఈ పాత్రను రెండు భాషల్లో పోషించడానికి నేను నిజంగా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. హిందీలో, తెలుగులో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నాను. అయితే రెండు భాషల్లో ఒకే ఎఫెక్ట్ తీసుకురావడం అన్నది నిజంగా ఛాలెంజింగ్. నేను ఈ రోల్ చేయడాన్ని ఆనందిస్తున్నాను” అని రాశారు

, , , ,
You may also like
Latest Posts from