ఇప్పుడున్న పోటీ పరిస్దితుల్లో టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకులనాడిని పట్టుకోవాలి. లేకపోతే మినిమం ఓపినింగ్స్ కూడా ఉండవు. ఈ విషయంలో పెళ్లి కాని ప్రసాద్ నిర్మాతలు ఓ అడుగు ముందే ఉన్నారు. ఈ చిన్న సినిమాకు మంచి ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
స్టార్ హీరో ప్రభాస్ ఈ సినిమా టీజర్‌ని (Pelli Kani Prasad Teaser) విడుదల చేశారు.
తన వంశానికి చెందిన శాసనాల గ్రంథం అనుసరించే పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ ప్రమాణం చేశాడు. అప్పట్నుంచి అతనికి పెళ్లి విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇంతకీ పెళ్లయిందా లేదా? తదితర విషయాలు తెలియాలంటే ‘పెళ్లి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad) చూడాల్సిందే.
సప్తగిరి, ప్రియాంకశర్మ హీరోయిన్స్ గా నటించిన చిత్రమిది. అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. కె.వై.బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తుంది.
‘ప్రసాద్ అనే నేను…’ అంటూ మొదలైన టీజర్‌లో సప్తగిరి, మురళీధర్ గౌడ్ చేసిన హంగామా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హాస్యం, సోషల్ సెటైర్ మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి.
లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్.