నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమా టీజర్ మార్చి 17న రిలీజ్ చేశారు. టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రం బిజినెస్ ఊపందుకుంది. థియేటర్ బిజినెస్ కు అదిరిపోయే ఎంక్వైరీలు వస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఇప్పటికే హిందీ, డిజినెస్ జరిగిపోయిందని ట్రేడ్ అంటోంది.
ఇక ఈ చిత్ర ఆంధ్రా రీజియన్ రైట్స్ 12 కోట్లకు, సీడెడ్ 3.70 కోట్లకు అమ్ముడయ్యాయని వినికిడి. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఎక్కువ అమ్ముడైన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. మిగతా ఏరియాల నుంచి కూడా అదిరిపోయే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని చెప్తున్నారు.
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్‌గా ‘వైజయంతీ ఐపీయస్’ పాత్రలో కనిపించనుంది.
తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, ఎమోషన్స్, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్, విజయశాంతి డైలాగ్స్ పవర్ ఫుల్గా ఉన్నాయి. ఈ మూవీ సమ్మర్ కానుకగా విడుదల కానుంది.