మహేష్ బాబు రీసెంట్ గా ఒరిస్సాలోని కోరాపుట్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కోసం కథ ప్రకారం, కోరాపుట్ లోని దేవ్ మాలి పర్వతాన్ని ఎంచుకున్నారు. ఆ పర్వత ప్రాంతంలోనే మహేష్, పృధ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాడు రాజమౌళి.

ఇప్పుడీ సినిమాకు ఉన్న క్రేజ్ ను, మహేష్-రాజమౌళి పాపులారిటీని వాడుకోవాలని భావించింది ఒరిస్సా సర్కారు. దేవ్ మాలి పర్వతం ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం. దానికి మరింత గుర్తింపుని తీసుకొచ్చేందుకు మహేష్ బాబు సహకారాన్ని కోరింది ఒరిస్సా ప్రభుత్వం. స్వయంగా ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిద, లొకేషన్ కు వెళ్లి మహేష్ ను కలిశారు.

ఒరిస్సా పర్యాటక రంగ అభివృద్ధి కోసం మహేష్ ముందుకొచ్చాడు. రాజమౌళితో కలిసి దేవ్ మాలి పర్వతంపై మొక్కలు నాటాడు. దానికి మహేష్ మొక్క అని పేరుపెట్టారు. మహేష్ రాకతో ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ గా మారుతుందని, ఒరిస్సా భావిస్తోంది.

, , ,
You may also like
Latest Posts from