బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు చాలా అవార్డ్ లు వచ్చాయి.
ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సైతం లపతా లేడీస్ ఎంపికైంది. ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి ఈ మూవీ నిలిచింది. అలాగే ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు వెళ్లింది. అయితే లాపతా లేడీస్ సినిమాపై సంచలన ఆరోపణలు వవస్తున్నాయి.
ఈ సినిమా కథను ఒక అరబిక్ ఫిల్మ్ నుంచి దొంగిలించి తీశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇది ప్రూవ్ చేస్తూ ఒక వీడియో కూడా ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. లాపతా లేడీస్’ సినిమా కథను అరబిక్ భాషా షార్ట్ ఫిల్మ్ ‘బుర్కా సిటీ’ నుండి దొంగిలించారని తెలుస్తోంది.
ఫాబ్రిస్ బ్రాక్ అనే దర్శకుడు రూపొందించిన అరబిక్ చిత్రం ‘బుర్ఖా సిటీ’(Burqa City). బుర్ఖా ధరించడం వల్ల కొత్తగా పెళ్లైన ఒక వ్యక్తి అనుకోనివిధంగా తన భార్యను మిస్ అవుతాడు. బుర్ఖాలో ఉన్న వేరే యువతిని తన భార్య అనుకొని ఇంటికి తీసుకువస్తాడు. తీరా నిజం తెలిసిన తర్వాత భార్య కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. ఎట్టకేలకు ఆమెను కొనుగొనడంతో కథ సుఖాంతం అవుతుందనే కథతో ఈ సినిమా సిద్ధమైంది. 2019లో ఇది విడుదలై అక్కడ విశేష ఆదరణ సొంతం చేసుకుంది.
2019 లో వచ్చిన బూర్ఖా సిటీ షార్ట్ ఫిల్మ్ కథతో పాటు కొన్ని సన్ని వేశాలు కిరణ్ రావు ‘లపాతా లేడీస్’ సినిమాకు చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఈ ఆస్కార్ నామినేటెడ్ మూవీ బుర్ఖా సిటీ అరబ్ సినిమాకు అనధికారిక రీమేక్ అంటూ నెట్టింట పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి బుర్కా సిటీ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన కొన్ని క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు.