ఇప్పటి వరకూ పాన్-ఇండియా అంటే ఒక భాషలో సినిమా తీసి మిగతా భాషల్లో డబ్ చేయడమే. కానీ “స్పిరిట్” అలా కాదు. ఇది భాషలు, బార్డర్లు దాటి దూసుకుపోయే కలయిక. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్నీ కలిసే స్క్రీన్ మీద, దేశం మొత్తం థియేటర్‌లలో ఒకే టైం పీక్స్ కు వెళ్లే చేరిక. అలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీస్తున్న “స్పిరిట్” లో ఒకే ఫ్రేమ్‌లో ఇండస్ట్రీ లెజెండ్స్—ప్రభాస్, మమ్ముట్టి కలిసి చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమా స్కేలు, అంచనాలు అన్నీ అద్భుతంగా మారిపోనున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ పాన్-ఇండియా మార్కెట్‌లో తన స్థానం పటిష్టం చేసుకున్న స్టార్. “బాహుబలి” తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకి క్రేజ్ వేర్వేరుగా ఉంది. సలార్ తో అది నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయింది. ఇదే క్రమంలో “స్పిరిట్”తో రా యాక్షన్, డీప్ ఎమోషన్స్ మిక్స్ చేసే పాత్రలో ప్రభాస్ మరోసారి తన పరిధిని విస్తరించనున్నాడు.

ఇంతలో మమ్ముట్టి ఎంట్రీ వస్తే? అంతే కథ మామూలుగా ఉండదు. మళయాళంలో లెజెండ్స్ లో లెజెండ్ అనిపించుకుంటున్న మమ్ముట్టి, దేశవ్యాప్తంగా తన నటనతో పేరొందిన వ్యక్తి. ఆయన సూపర్ స్టార్డం కేవలం కేరళ వరకే పరిమితం కాదు – ఇప్పుడు ఇండియా మొత్తం తెలుసు ఆయన. ఓటిటిల పుణ్యమా అని తెలుగువారికి ఇంకా బాగా దగ్గరయ్యారు.

ఇక “స్పిరిట్”లో ఈ స్టార్స్ ఇద్దరూ కలవడం వల్ల కేవలం బాక్సాఫీస్ స్టామినా పెరగడం కాదు—కంటెంట్, నటన, డెఫ్త్ అన్నీ మరో లెవెల్‌కు వెళ్తాయి. సందీప్ రెడ్డి వంగా స్టైల్ లో సైకలాజికల్ ఇంటెన్సిటీ, బోల్డ్ ఎమోషనల్ లేయర్లు ఉంటాయనటంలో సందేహం లేదు. ఇందులో మమ్ముట్టి పాత్ర ఓ సాలిడ్ స్పైన్ లా ఉండబోతుందనేది ఇండస్ట్రీ టాక్.

మీ అభిప్రాయం ఏమిటి? మమ్ముట్టి పాత్రపై మీకు ఉన్న అంచనాలేమిటి? ప్రభాస్‌తో కలిస్తే ఎలా ఉంటుందో మీ ఊహల్లో? కామెంట్ చేయండి!

, , ,
You may also like
Latest Posts from