ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వి పై ఉగ్రదాడి జరిగిన తర్వాత రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమె నేపథ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
ఇమాన్వికి పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని, ఆమె తండ్రి పాకిస్థాన్ సైన్యంలో గతంలో మేజర్‌గా పనిచేసి, ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారని ప్రచారం జరుగుతోంది.
ఈ సమాచారం ఆధారంగా, పాకిస్థానీ మూలాలున్న వ్యక్తిని తమ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్‌గా వద్దంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో ఈ డిమాండ్లకు ప్రాధాన్యత ఏర్పడింది.
దీంతో ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి ఇస్మాయిల్ క్లారిటీ ఇచ్చింది. పెహల్గామ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు సంతాపం ప్రకటించి తన గురించి జరుగుతున్న ప్రచారం పట్ల వివరణ పొందుపరిచింది.
ఆ పోస్ట్ లో ..
తనకి, పాకిస్తానీ ఏ విధమైన సంబంధం లేదని తాను ఇండో అమెరికన్ అమ్మాయిని అని ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. ‘ముందుగా నేను పహల్గాంలో జరిగిన సంఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
ఈ సంఘటన వల్ల నా హృదయం బరువెక్కింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
విద్వేషం రెచ్చగొట్టేలా నా గురించి, నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి వచ్చిన ఫేక్ వార్తల విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా.
ముందుగా నాకు పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధం లేదు. పాకిస్తాన్ మిలటరీలో మా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఇది ఆన్ లైన్ లో ట్రోలర్స్ సృష్టించిన ఫేక్ న్యూస్ మాత్రమే.
నేను హిందీ, తెలుగు, గుజరాతీ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేను జన్మించింది అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. వెంటనే వారు అమెరికా పౌరులుగా మారారు.
USAలో నా యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటి గా, కొరియోగ్రాఫర్‌గా, నర్తకిగా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. ఈ రంగంలో చాలా పని చేసిన తర్వాత, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
నా రక్తంలో లోతుగా భారతీయత నెలకొంది. సోషల్ మీడియాని విద్వేషం కోసం కాకుండా ఐక్యత కోసం ఉపయోగించండి అంటూ ఇమాన్వి తనని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చింది.
యూత్ లో ఉన్నప్పుడే తల్లితండ్రులు చట్టప్రకారం అమెరికా వచ్చి సెటిలై అక్కడి పౌరులయ్యారని, లాస్ యాంజిల్స్, క్యాలిఫోర్నియాలో జన్మించిన తాను యూనివర్సిటీ చదువు అక్కడే పూర్తి చేశానని పేర్కొంది.
సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో పాప్యులారిటీ సంపాదించుకున్న ఇమాన్వి, ఆ క్రేజ్‌తోనే ప్రభాస్ వంటి అగ్ర హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది.