సెన్సేషన్ హిట్ కొట్టిన ద‌స‌రా(Dasara) డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) హీరోగా నాని(nani) నిర్మాత‌గా సినిమా రానున్న విష‌యం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప‌ట్టాలెక్కుతుందా? ఎప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వ‌స్తాయా అని అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమా గురించిన ఓ న్యూస్ అంతటా హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా కోసం శ్రీకాంత్ ఓదెలను నాని తీసుకెళ్లాడట. అయితే, మెగాస్టార్ ఈ సినిమా కథ నచ్చిన తర్వాత శ్రీకాంత్ ఓదెలకు ఓ కండీషన్ పెట్టాడట.

శ్రీకాంత్ చెప్పిన కథను నాని ప్రొడ్యూస్ చేస్తేనే తాను సినిమాలో నటిస్తానని చిరు చెప్పడం విశేషం. ఇక ఈ ప్రాజెక్టును కడా త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది.

చిరంజీవి- శ్రీకాంత్ సినిమా ప్యార‌డైజ్(Paradise) త‌ర్వాత రానుందని, ఆ సినిమాను 2027లో రిలీజ్ చేయ‌నున్నామ‌ని, సినిమాకు సంబంధించిన మిగిలిన అప్డేట్స్ షూటింగ్ మొద‌ల‌య్యాక ఇస్తామ‌ని, చిరంజీవి గారంటే త‌న‌కు మాట‌ల్లో చెప్ప‌లేని అభిమాన‌మ‌ని నాని వెల్ల‌డించాడు.

చిరూ సినిమాకు ప్రొడ్యూస‌ర్ గా ఉంటే త‌న‌కు ఓ బ‌యోపిక్ తీస్తున్న ఫీలింగ్ వ‌స్తుంద‌ని, ప్ర‌తీ క్ష‌ణం ఆ సినిమా కోస‌మే ఆలోచిస్తున్నానంటూ, అదొక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని, దాని కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నాన‌ని నాని తెలిపాడు.

, , , ,
You may also like
Latest Posts from