ఇప్పుడు బాల‌య్యే మాస్ రారాజు! క్రేజ్‌, మార్కెట్‌ రెండూ పీక్‌లో ఉన్నాయి! . ఇప్పటి నందమూరి బాలకృష్ణ కెరీర్ ని చూస్తే అసలైన మాస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఒకప్పుడు కొంచెం సెలెక్టివ్‌గా సినిమాలు చేసే బాలయ్య ఇప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ… వాన కురిపించేస్తున్నాడు! ఎటు చూసినా బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు, మాస్‌, క్లాస్‌, యూత్‌ – అన్నీ పట్టేసిన పవర్‌తో దూసుకెళ్తున్నాడు.

ప్రస్తుతం ‘అఖండ 2’ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య, ఇదే సమయంలో మరో రెండు మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. క్రిష్ ఒక వైపు, గోపీచంద్ మలినేని మరోవైపు — ఈ ఇద్దరి కథలకు బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, చెన్నై వర్గాల టాక్ ప్రకారం బాలయ్య ‘జైలర్ 2’లో కూడా కనిపించనున్నాడట.

ఇదిలా ఉండగా, తమిళ ఇండస్ట్రీ నుంచి మరో పవర్‌ఫుల్ అడిషన్ బలమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ‘మార్క్ ఆంటోనీ’, ‘గుడ్ బాడ్ అగ్లీ’ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్, బాలయ్య కోసం ఓ మాస్ కథ రెడీ చేశాడట. బాలయ్య కూడా ఆ కథ విన్నాక ఆసక్తిగా ఉన్నాడన్నది ఫిలిం నగర్ టాక్.

అయితే బాలయ్య లైనప్ చూస్తే రాబోయే రెండు సంవత్సరాలు నిండిపోయినట్లే.

ఈ జూన్‌లో గోపీచంద్ మలినేని సినిమాను ప్రారంభించనున్నాడు.

దసరాకి క్రిష్ దర్శకత్వంలో మరో భారీ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.

మధ్యలో ‘జైలర్ 2’కి కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలన్నీ పూర్తయ్యాకే అధిక్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని సినిమా స్పీడ్‌గా పూర్తి అయ్యే వీలున్నా, క్రిష్ సినిమా మాత్రం గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో నెమ్మదిగా సాగుతుంది.

ఎందుకంటే ఆ చిత్రంతో మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో ఆ ప్రాజెక్ట్‌కి ఎంత కేర్ తీసుకున్నా తక్కువే.

ఇక మధ్యలో హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య బాధ్యతలు, బసవతారకం పనులు కూడా ఉంటాయి. ఇవన్నీ బిజీగా ఉండే బాలయ్య, అధిక్ కథకు ఓకే చెప్పినా, సెట్స్‌పైకి రావడానికి కొంత సమయం పడే అవకాశమే ఉంది.

కానీ, బాలయ్య – అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌ ఓన్లీ మేటర్ ఆఫ్ టైమ్! ఒకసారి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే, మాస్ ఫాన్స్‌కి పండగే పండగ.

You may also like
Latest Posts from