“ఆమిర్ ఖాన్ బ్యాడ్ టైమ్ మళ్లీ స్టార్ట్ అయిందా?”
ఒక్కోసారి స్టార్ హీరోల కెరీర్‌లోనూ ఓ టైం వస్తుంది… ఎం చేసినా ఆడియెన్స్ కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా అలాంటి ఫేజ్‌కి చేరుకున్నాడా అనే అనుమానం టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో, బాలీవుడ్ ప్రేక్షకుల్లో గట్టిగా వినిపిస్తోంది.
“లాల్ సింగ్ చడ్డా” ఫెయిల్యూర్ నుంచి కోలుకునేందుకు చాలా గ్యాప్ తీసుకున్నా… ఇప్పుడు “సితారే జమీన్ పర్” సినిమాతో ఎదురవుతున్న ట్రోలింగ్ చూస్తే — ఆమిర్ ఖాన్‌కు మళ్లీ ఓ భారీ షాక్ దగ్గర్లోనే ఉందనిపిస్తోంది.
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకున్న ఆమిర్ ఖాన్, తర్వాత చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా అంతకన్నా పెద్ద ఫెయిల్యూర్ అయింది.
ఆ సినిమా ట్రైలర్ నుంచే తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతూ, విడుదల రోజే ఖాళీ థియేటర్లు, క్యాన్సిల్ అయిన షోలు చూసిన ఆమిర్… చాలా బ్రేక్ తీసుకుని ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల మనసు దోచాలని ట్రై చేస్తున్నాడు.
కానీ ఇది కూడా నెగెటివిటీలోంచి తప్పించుకోలేకపోతుంది. మొదట ఇది ‘తారే జమీన్ పర్’ సీక్వెల్ అని ఊహించగా, అసలు ఇది స్పానిష్ మూవీ ‘చాంపియన్స్’ రీమేక్ అని తెలిసి, అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పోస్టర్లు, ట్రైలర్ అన్నీ ఒరిజినల్ కాపీనే అంటూ సోషల్ మీడియాలో ఆమిర్‌పై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది.
“ఒక స్పానిష్ సినిమాను కాపీ కొట్టేందుకు నాలుగేళ్లు టైం తీసుకున్నావా?” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌గా తీసిన లాల్ సింగ్ చడ్డాతో తగిలిన గాయానికి మళ్లీ తాజా సినిమా మరింత దెబ్బ కావొచ్చన్న భయం మొదలైంది.
ఇదంతా చూసిన ఆమిర్ ఖాన్ మాత్రం… తన మీద ఇంత నెగెటివిటీ ఎలా వచ్చిందో ఆశ్చర్యపోతుండక మానడు. బాలీవుడ్‌లో ‘పర్‌ఫెక్షనిస్ట్’ అనే బిరుదుతో నిలబడ్డ ఈ స్టార్… ఇప్పుడు పరాజయాల నుంచి ఎలా గట్టెక్కతాడో చూడాలి.