పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) జూన్ 12న థియేటర్లలో grandగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్‌కి తొలి పాన్ ఇండియా రిలీజ్ కావడం విశేషం. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో, మేకర్స్ దేశవ్యాప్తంగా ఓ పెద్ద ప్రమోషనల్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇటివలి సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరులో ముంబయిలో OG సినిమా షూటింగ్ కోసం వెళ్లనున్నారు. అదే సమయంలో హరిహర వీర మల్లుకు సంబంధించిన బహిరంగ ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ముంబయిలో జరిగే ఈవెంట్ ద్వారా ఉత్తర భారతదేశంలో సినిమా ప్రమోషన్‌కు భారీ బూస్ట్ లభించే అవకాశం ఉంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా తన సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమం ద్వారా ఉత్తరాదిలోనూ గణనీయమైన గుర్తింపు సంపాదించారు. అక్కడ ఆయనను “Sanatana Dharma Reformer” అంటూ అభివర్ణిస్తున్నారు.
ఇక హరిహర వీర మల్లు కథ విషయానికి వస్తే… ఇది మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. “Battle for Dharma” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్లు సైతం సనాతన ధర్మం పట్ల సినిమా ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, పవన్ ముంబయిలో ప్రమోట్ చేయడం వల్ల హిందీ వెర్షన్‌పై భారీ అంచనాలు ఏర్పడే అవకాశముంది.
ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, కృష్ణ జగర్లమూడి (క్రిష్) తీర్చిదిద్దారు. మ్యూజిక్ లెజెండ్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.